అందంగా కనబడటానికి అయిదు మార్గాలు

చూడముచ్చటగా, అందంగా, గ్రెషియస్ గా కనబడాలని అందరికి ఉంటుంది.దీనికోసం ఏవేవో మందులు వాడనక్కరలేదు.

టైమ్ కేటాయించి ఫేస్ ప్యాక్ రోజూ పెట్టుకోవాల్సిన పనే లేదు.అయిదు మార్గాలు, అయిదంటే అయిదే అలవాట్లు చాలు.

* నీళ్లు బాగా తాగడం, ఎల్లప్పుడ హైడ్రేటెడ్ గా ఉండటం.ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పని.చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వరకే కాదు, శరీరాన్ని లోపలి నుంచి అందంగా ఉంచుకుంటేనే బయటకి కూడా అందంగా కనబడతారు.* సరైన నిద్ర కేటాయించడం.

శరీరానికి సరైన విశ్రాంతిని ఇవ్వనంత కాలం అందంగా కనబడాలనుకోవడం అత్యాశే.రోజుకి 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా ఒంటికి ఇవ్వాల్సిందే.

Advertisement

అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.* చెడు అలవాట్లకి దూరంగా ఉండటం.

సిగరేట్లు, మద్యం మీ అందాన్ని, చర్మ సౌందర్యాన్ని చెడగొట్టేవే.ముఖ్యంగా సిగరేట్లకి దూరంగా ఉండటం.

మహేష్ బాబు, హృతిక్ రోషన్ లాంటి అందగాళ్ళు సిగరేట్లు ఎందుకు మానేశారో అర్థం చేసుకోండి.అలాగే అరోగ్యకరమైన తిండి, ఫలాలు తినడం.

* శరీరాన్ని కదిలించడం.అంటే క్రమం తప్పని వ్యాయామం.

మెరిసే మృదువైన చ‌ర్మం కోసం ఈ ఓట్స్ ప్యాక్స్ ట్రై చేయండి!

శరీరాన్ని ఒకే చోట కూర్చోబెట్టకుండా, కాస్త పనిని ఇవ్వండి.రక్తం శరీరమంతా బాగా సరఫరా జరిగేలా చూసుకోండి.

Advertisement

* వేదాంతం లాగా అనిపించినా, నవ్వు అందాన్ని పెంచుతుంది.నవ్వులో ఉన్న అందం మరెక్కడ ఉండదు.

మానసిక సమస్యలను దగ్గరకి రానివ్వకుండా నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి.మీరెప్పుడు అందంగా కనబడతారు.