మార్కెట్లోకి ఒకేసారి 5 కొత్త ఫోన్లు వస్తున్నాయి.. ఓ లుక్కేయండి మరి!

ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్లు( Smart phones ) వాడనివారు దాదాపుగా వుండరనే చెప్పుకోవాలి.మరీ ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లు అంటే పడిఛస్తారు.

మార్కెట్లోకి ఎలాంటి మోడల్ కంపెనీ ఫోన్ వచ్చినా సరే వారి జేబులో వుండాల్సిందే.ఇక వాటి కోసం ఎంతైనా వెచ్చిస్తారు.

ఈ న్యూస్ అలాంటివారికోసమే.త్వరలో స్మార్ట్ మార్కెట్లోకి ఒకేసారి 5 కొత్త ఫోన్లు రాబోతున్నాయి.

ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.ఈ లిస్టులో మొదటిది “గూగుల్‌ పిక్సెల్‌ 8.”( Google Pixel 8 ) ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ సిరీస్‌ ఫోన్‌లు ఈ అక్టోబర్ 4వ తేదీన అంటే ఏరోజే లాంచ్‌ కానున్నాయని మీకు తెలుసా? గూగుల్ పిక్సెల్‌ 8 ఫోన్‌ 6.70 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి వుండి 50 మెగా పిక్సెల్స్ తో రాబోతుంది.ఈ ఫోన్‌ రూ.58 వేల వరకు ఉండొచ్చని అంచనా.

Advertisement

ఈ లిస్టులో రెండవది “గూగుల్ పిక్సెల్ 8 ప్రో.”( Google Pixel 8 Pro ) ఇక గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ డిస్‌ప్లే ఇవ్వనున్నారు.50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా కలిగి వుండి 11 ఎంపీ కెమెరాతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.ధర విషయానికొస్తే ఇది కూడా సుమారుగా యాభై వేలు వుంటుందని అంచనా.

ఇక ఈ లిస్టులో మూడవ స్మార్ట్ ఫోన్ “శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ.”( Samsung Galaxy S23 FE ) ఇది కూడా ఇదే రోజు వస్తోంది.ఇది 6.4 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి వుండి, 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.అలాగే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది.

ఇక ఈ లిస్టులో నాల్గవది “వివో వీ29.” ( Vivo V29 )ఇది కూడా ఇదే రోజు మార్కెట్లోకి వస్తోంది.ఈ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌ ధర రూ.40వేలలోపు ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ రానుంది.ఇక చివరగా “వివో వీ29 ప్రో”( Vivo V29 Pro ) గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.ఈ ఫోన్‌ ధర రూ.44 వేల వరకు ఉండొచ్చని అంటున్నారు.ఇది 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు