మాదక ద్రవ్యాల అక్రమ రవాణా .. ముగ్గురు భారతీయులను అమెరికాకు అప్పగించనున్న కెనడా

కెనడియన్, అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య జాయింట్ ఆపరేషన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ ఘటన విచారణకు సంబంధించి ముగ్గురు ఇండో కెనడియన్లతో సహా ఐదురుగు వ్యక్తులను అమెరికాకు అప్పగించనున్నారు కెనడా అధికారులు.

 3 Indo-canadians Among 5 Persons To Be Extradited To The Us For Drug Trafficking-TeluguStop.com

‘‘ డెడ్ హ్యాండ్ ’’( Dead Hand ) అనే కోడ్ నేమ్‌తో యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ)లోని కంబైన్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ (సీఎఫ్‌ఎస్ఈయూ) యూనిట్‌లు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌సీఎంపీ .మెక్సికో, యూఎస్, కెనడాల మధ్య నెట్‌వర్క్ ట్రాఫికింగ్ డ్రగ్స్‌తో సంబంధాలున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.నిందితులను క్యూబెక్‌లోని ట్రోయిస్ రివియర్స్‌కు చెందిన ఇవాన్ గ్రావెల్ గొంజాలెజ్( Ivan Gravel Gonzalez ) (32), మాంట్రియల్‌కు చెందిన రాబర్టో స్కోప్పా ( Roberto Scoppa )(55), బ్రాంప్టన్‌కు చెందిన ఆయుష్ శర్మ( Ayush Sharma ) (25), బ్రాంప్టన్‌కు చెందిన గురామృత్ సిద్ధూ( Guramrit Sidhu ) (60), కాల్గరీకి చెందిన శుభమ్ కుమార్‌ (29)గా గుర్తించారు.

ఎఫ్‌బీఐ ప్రకారం.అమెరికా నుంచి కెనడాకు భూ మార్గం ద్వారా కొకైన్, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్‌లో వీరంతా సభ్యులు.

Telugu American Law, Ayush Sharma, Canadian, Hand, Guramrit Sidhu, Ivangravel, M

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూఎస్ అటార్నీ మార్టిన్ ఎస్ట్రాడ్( US Attorney Martin Estrad ) మాట్లాడుతూ.ఈ కుట్ర మూడు దేశాలలో విస్తరించి వుందన్నారు.మెక్సికోలోని కార్టెల్‌లో డ్రగ్ సరఫరాదారులు, లాస్ ఏంజిల్స్‌లో డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు, బ్రోకర్లు.కెనడాలో ట్రక్ డ్రైవర్లు వున్నారు.గురామృత్ సిద్ధూ .మెక్సికో, లాస్ ఏంజెల్స్‌లోని సరఫరాదారుల నుంచి మెథాంఫేటమిన్ కొనుగోలు చేశాడని, కెనడాకు వాటిని తరలించడానికి ట్రక్ డ్రైవర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడని ఆరోపణలు వచ్చాయి.శర్మ, కుమార్‌లు ట్రక్కు డ్రైవర్లుగా పనిచేసినట్లు నివేదిక వివరించింది.

Telugu American Law, Ayush Sharma, Canadian, Hand, Guramrit Sidhu, Ivangravel, M

845 కిలోల మెథాంఫేటమిన్, 951 కిలోల కొకైన్, 20 కిలోల ఫెంటానిల్, 4 కిలోల హెరాయిన్‌ను నిందితులు సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.వీటి విలువ 16 మిలియన్ డాలర్ల నుంచి 28 మిలియన్ డాలర్ల మధ్య వుంటుందని పేర్కొంది.కెనడా పోలీసులు 9,40,000 డాలర్ల నగదు, 70 కిలోల కొకైన్, 4 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

స్కోప్పాకు ఇటాలియన్ మాఫియాతో సంబంధం వుందనే ఆరోపణలు వున్నట్లు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube