యూకే : ముగ్గురు భారతీయ యువ శాస్త్రవేత్తలను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం

యూకేలో ( UK ) ముగ్గురు భారతీయ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక ‘‘ Blavatnik Awards for Young Scientists ’’ పురస్కారం దక్కింది.కెమికల్, ఫిజికల్, లైఫ్ సైన్సెస్ రంగాలలో విశేష సేవలు అందించినందుకు వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

 3 Indians Win United Kingdom’s Prestigious Blavatnik Awards For Young Scientis-TeluguStop.com

ఫిబ్రవరి 27న లండన్‌లో జరిగే బ్లాక్ టై గాలా డిన్నర్ అవార్డు వేడుకలో రాహుల్ ఆర్ నాయర్,( Rahul R Nair ) మెహుల్ మాలిక్,( Mehul Malik ) తన్మయ్ భరత్( Tanmay Bharat ) తదితరులకు అవార్డులను ప్రధానం చేయనున్నారు.వీరికి మొత్తం 4,80,000 పౌండ్ల గ్రాంట్‌లు అందనున్నాయి.

యాక్సెస్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ , బ్లావత్నిక్ ఫ్యామిలీ ఫౌండేషన్ హెడ్ సర్ లియోనార్డ్ బ్లావత్నిక్( Sir Leonard Blavatnik ) మాట్లాడుతూ.ఒక సైంటిస్ట్‌కు కెరీర్‌లో ప్రారంభంలోనే గుర్తింపు , నిధులను అందించడం వల్ల అత్యుత్తమ ఆవిష్కరణలు, శాస్త్రీయ పురోగతికి దోహదపడుతుందన్నారు.

ఈ అవార్డులు యూకే సైన్స్, ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తల( Young Scientists ) కెరీర్‌లను ప్రోత్సహించినందుకు తాము గర్విస్తున్నామని బ్లావత్నిక్ తెలిపారు.రాబోయే సంవత్సరాల్లో వారి అదనపు ఆవిష్కరణల కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Telugu Blavatnikawards, Indian, Mehul Malik, Rahul Nair, Sirleonard, Indians, Ki

మాంచెస్టర్ యూనివర్సిటీలో మెటీరియల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసరైన రాహుల్ నాయర్. శక్తి విభజన, వడపోత సాంకేతికతలను ప్రారంభించే ద్విమితీయ (2డీ) పదార్ధాల ఆధారంగా పొరలను అభివృద్ధి చేసినందుకు ఫిజికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్‌ కేటగిరీలో అవార్డుకు ఎంపిక చేశారు.

Telugu Blavatnikawards, Indian, Mehul Malik, Rahul Nair, Sirleonard, Indians, Ki

ఇక క్వాంటం భౌతిక శాస్త్రవేత్త, ఫిజిక్స్ ప్రొఫెసర్ మెహుల్ మాలిక్ హెరియట్ వాట్ యూనివర్సిటీలో విప్లవాత్మక పద్ధతుల ద్వారా క్వాంటం కమ్యూనికేషన్‌లను( Quantum Communications ) అభివృద్ధి చేస్తున్నారు.అలాగే ఎంఆర్‌సీ లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో స్ట్రక్చరల్ స్టడీస్ విభాగంలో స్ట్రక్చరల్ మైక్రోబయాలజిస్ట్ , ప్రోగ్రామ్ లీడర్ అయిన డాక్టర్ భరత్ సూక్ష్మజీవులపై కణ ఉపరితల అణువుల పరమాణు స్థాయి చిత్రాలను రూపొందించడానికి అత్యాధునిక క్రియో ఈటీ పద్ధతులను అభివృద్ధి చేశారు.భరత్ , మాలిక్ ఇద్దరూ తమ పరిశోధన కోసం 30,000 పౌండ్ల గ్రాంట్‌ను అందుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube