పీకలదాకా తాగి మద్య వేలు చూపి: ముగ్గురు ఇండియానా జడ్జిల సస్పెన్షన్

ఈ ఏడాది మే నెలలో వైట్ క్యాసల్ పార్కింగ్ కాల్పుల ఘటనలో ముగ్గురు న్యాయమూర్తులను జీతం లేకుండా సస్పెండ్ చేశారు.

వీరిలో ఇద్దరు పురుష జడ్జిలు కాగా.

మరొకరు మహిళా న్యాయమూర్తి.ఉడ్జ్ ఆండ్రూ ఆడమ్స్‌ను 60 రోజులు, బ్రాడ్లీ జాకబ్స్ మరియు సబ్రినా బెల్లను 30 రోజులు సస్పెండ్‌కు గురయ్యారు.

ముగ్గురు న్యాయమూర్తులు వారి సస్పెన్షన్ గడువు ముగిసిన తర్వాత తిరిగి విధుల్లో నియమించబడతారని ఇండియానా పోలీస్ శాఖ తెలిపింది.ఘటన జరిగిన రోజు సాయంత్రం న్యాయమూర్తుల చర్యలను ఇండియానా సుప్రీంకోర్టు దుష్ప్రవర్తనగా తేల్చింది.

వీరి చర్యలు కారణంగా మొత్తం ఇండియానా న్యాయవ్యవస్థను కించపరిచినట్లు అయ్యిందని కోర్టు అభిప్రాయపడింది.సదరు ముగ్గురు న్యాయమూర్తుల్లో ఈ కేసుకు సంబంధించి ఆడమ్స్‌పై మాత్రమే క్రిమినల్‌గా అభియోగాలు మోపబడ్డాయి.

Advertisement
3 Indiana Judges Suspended After White Castle Shooting-పీకలదాకా

ఆయన సెప్టెంబర్ నెలలో ఈ నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.అయితే చాలా వరకు శిక్షను నిలిపివేసింది.

శిక్షాకాలం మొత్తంలో ఆడమ్స్ కేవలం 2 రోజులు మాత్రమే జైలులో ఉన్నాడు.ఈ ఏడాది ఏప్రిల్ 30 ఒక జ్యూడిషీయల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ముగ్గురు న్యాయమూర్తులు ఇండియానాపోలీస్‌ వచ్చారు.

ఆ రోజు రాత్రి ఆడమ్స్, జాకోబ్, బెల్ పీకలదాకా మద్యం సేవించి అక్కడికి దగ్గరలోని వైట్ కాజిల్‌లోని క్లబ్ వద్దకు వెళ్లారు.అయితే అర్థరాత్రి కావొస్తుండటంతో దానిని మూసివేశారు.

3 Indiana Judges Suspended After White Castle Shooting

అనంతరం రెస్టారెంట్ పార్కింగ్ ప్రాంతంలో ఈ ముగ్గురు జడ్జిలు ఒక ఎస్‌యూవీ డ్రైవర్, ప్రయాణీకుడితో వాగ్వాదానికి దిగారు.ఇదే సమయంలో బెల్ తన మధ్య వేలును పైకి లేపి వాహనంలోని జంటకు చూపించడంతో ఇది మరింత పెరిగింది.ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన బ్రాండన్ కైజర్ అనే వ్యక్తి తుపాకీతో ఆడమ్స్ కడుపులో, జాకబ్ ఛాతీపై కాల్పులు జరిపాడు.

అనంతరం కైజర్, అతని అనుచరుడు అల్ఫ్రెడో వాజ్వ్కెజ్ అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్రంగా గాయపడిన ఇద్దరు జడ్జిలను పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.శస్త్రచికిత్సల అనంతరం వారు డిశ్చార్జి అయ్యారు.

Advertisement

అయితే ఆడమ్స్, జాకబ్స్ ఆసుపత్రిలో చేరే సమయంలో వారిద్దరూ మత్తులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.మద్యం మత్తులో వీరు చేసిన దుష్ప్రవర్తన కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

మరోవైపు సస్పెన్షన్ అనంతరం జాకొబ్స్, ఆడమ్స్ ఇద్దరు న్యాయస్థానానికి క్షమాపణలు తెలిపారు.

తాజా వార్తలు