2023 సంవత్సరంలో సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఐదు సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో తొలి హిట్ కొట్టే హీరో ఎవరు అనే ప్రశ్నకు వీరసింహారెడ్డి సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరసింహారెడ్డి సినిమాకు సెన్సార్ టాక్ పాజిటివ్ టాక్ ఉండటంతో పాటు ఇండస్ట్రీలో కూడా టాక్ పాజిటివ్ గా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు తొలి భారీ విజయాన్ని అందిస్తుందని బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించి ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2023 సంవత్సరంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను బాలయ్య సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.తెగింపు, వారసుడు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాలకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు.అందువల్ల బయ్యర్లు సైతం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ ను మరింత పెంచేలా ఈ రెండు సినిమాలు ఉండాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.వీరసింహారెడ్డి బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు బిజినెస్ భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది.బాలయ్య కెరీర్ పరంగా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.
బాలయ్య సినిమాలన్నీ మాస్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే తెరకెక్కుతుండటం గమనార్హం.బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారో చూడాలి.