వైరల్: తల్లి కోసం ఓ 14 ఏళ్ల బాలుడు పడిన కష్టాన్ని చూస్తే భగీరథుడు అని అంటారు!

సాధారణంగా తల్లికి ఆసరాగా కూతుళ్లు నిలుస్తారు.తండ్రికి కొడుకులు సాయం అందిస్తారు.

అయితే ఓ 14 ఏళ్ల బాలుడు తన తల్లి కష్టం చూసి చలించిపోయి భగీరథుడిలా శ్రమించి, భూగర్భ జలాన్ని తన ఇంటికి రప్పించాడు.అదొక కరువు ప్రాంతం.

తరచు అక్కడ ఎండాకాలం వచ్చేటప్పటికీ నీటి సంక్షోభం వీవ్రస్థాయిలో ఉంటుంది.దాంతో అక్కడ తాగడానికే నీరు దొరకని పరిస్థితి.

అలాంటి చోట తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆ సమస్య నుంచి ఎలాగన్నా బయటపడాలని అనుకున్నాడు ఆ బాలుడు.దీంతో ఒ‍క్కసారిగా ఆ బాలుడు ఆ ప్రాంతంలో సెలబ్రెటీగా మారిపోయాడు.

Advertisement

వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర ( Maharashtra ) పాల్ఘర్‌ జిల్లాలోని కెల్వె గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణవ్‌( Pranav ) అనే బాలుడు తన తల్లి కోసం వయసుకు మించిన సాహసం చేసి అందరి మన్ననలు పొందాడు.ప్రణవ్‌ తల్లి దర్శన( Darshana ) నీటి కోసం రోజు ఎంతో కస్టపడి నది వద్దకు వెళ్లాల్సి వచ్చేది.ఈ కష్టాన్ని ఎలాగైనా తానే తీర్చాలని అనుకొని, అనుకున్నదే తడువుగా బావిని తవ్వాలని( Well ) అనుకున్నాడు.

అందు కోసం భూమిని తవ్వడం ప్రారంభించాడు.ఈ క్రమంలో నిరంతరంగా శ్రమించాడు.

రోజుకి కేవలం 15 నిమిషాలు మాత్రమే భోజనానికి బ్రేక్‌ తీసుకునేవాడని ప్రణవ్‌ తండ్రి వినాయక్‌ చెబుతున్నాడు.

ఈ క్రమంలో ప్రణవ్‌ మట్టిని తవ్వుతుంటే రాళ్లను తొలగించడం వంటివి చేసేవాడినని తన తండ్రి చెప్పుకొచ్చాడు.ఎట్టకేలకు ప్రణవ్‌ ప్రయత్నానికి గంగమ్మ కరుణించి ఊరకలేసుకుంటూ భూమి నుంచి ఉబికి బయటకు వచ్చింది.దాంతో ఇక ప్రణవ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!

మొత్తం 5 రోజుల్లో పని పూర్తి చేశాడు ప్రణవ్‌.ఇక మా అమ్మ రోజు ఉదయం నీళ్ల కోసం బకెట్లు, బిందులతో నీళ్లు తీసుకురావాల్సిన కష్టం తప్పిందని ప్రణవ్‌ ఎంతో ఆనందంగా చెబుతున్నాడు.

Advertisement

కాగా తల్లి కోసం ఓ బాలుడు బావిని తవ్వాడన్న విషయం గ్రామమంతా వ్యాపించడంతో.ఆ ఊరి ప్రజలు, ప్రణవ్‌ స్నేహితులు ఆ బావిని చూసేందుకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు.

తాజా వార్తలు