ఒకే ఓవర్ లో రెండు హ్యాట్రిక్ లు సాధ్యమేనా.. 12 ఏళ్ల కుర్రాడు సరికొత్త రికార్డు..!

క్రికెట్ లో ఒకే ఓవర్ లో వరుసగా రెండు లేదా మూడు వికెట్లు తీయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.

ఎప్పుడో ఓసారి అరుదుగా బౌలర్ హ్యాట్రిక్ ( Hatrick ) తీయడం జరుగుతుంది.

అది కూడా టీ20లో మాత్రమే సాధ్యమవుతుంది.అయితే ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్( Double Hatrick ) అంటే 6 బంతులకు ఆరు వికెట్లు తీయడం సాధ్యం అవుతుందా అంటే చాలామంది అసాధ్యం అనే అంటారు.

కానీ ఓ పన్నెండేళ్ల కుర్రాడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ రెండు హ్యాట్రిక్ లను ఒకే ఓవర్ లో పడగొట్టాడు.ఈ రికార్డ్ ఇంగ్లాండులోని ఒక క్లబ్ క్రికెట్లో నమోదయింది.

ఇంగ్లాండ్ లో క్లబ్ బ్రోమ్స్ గ్రోవ్ క్రికెట్ క్లబ్- కుక్ హిల్ మధ్య మ్యాచ్ జరిగింది.క్లబ్ బ్రోమ్స్ గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరఫున ఒలివర్ వైట్ హౌజ్( Oliver White House ) అనే 12 ఏళ్ల కుర్రాడు బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి కుక్ హిల్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు.

12 Year Old Bowler Take Double Hat Trick In An Over Details, 12 Year Old Bowler
Advertisement
12 Year Old Bowler Take Double Hat Trick In An Over Details, 12 Year Old Bowler

ఆరుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడంతో ఒకే ఓవర్ లో డబుల్ హ్యాట్రిక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఒలివర్ రెండు ఓవర్లలో 8 వికెట్లు తీసి ఒక్క పరువు కూడా ఇవ్వలేదు.క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు ఎప్పటికీ నిలిచిపోతోంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఒలివర్ పెద్ద స్టార్ అయిపోయాడు.ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

స్టార్ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయి అభినందనలు తెలుపుతున్నారు.

12 Year Old Bowler Take Double Hat Trick In An Over Details, 12 Year Old Bowler

ఒలివర్ కుటుంబానికి క్రీడలకు అత్యంత దగ్గరి సంబంధం ఉంది.ఒలివర్ అమ్మమ్మ యాన్ జోన్స్ 1969 లో వింబుల్డన్ టైటిల్ గెలిచారు.ఇక ఒలివర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడంతో పాటు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు