ఇంగ్లాండ్‌లో సిక్కును తమ జాతిగా ఎంచుకున్న లక్ష మంది ప్రజలు..

ఇంగ్లాండ్‌( England )లో సిక్కుల సంఖ్య భారీగా పెరుగుతోంది.దీనికి తాజాగా విడుదలైన జనాభా లెక్కల డేటాని నిదర్శనంగా నిలుస్తోంది.

 100,000 People Who Chose Sikh As Their Race In England , England, Wales, Uk, Of-TeluguStop.com

ఇంగ్లాండ్, వేల్స్ కోసం యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ( ONS ) రీసెంట్ గా 2021 జనాభా లెక్కల డేటాను విడుదల చేసింది, ఈ డేటాలో 525,865 మంది సిక్కులుగా ఉన్నట్లు తెలిసింది, ఇది 2011 జనాభా లెక్కల నుంచి 22% పెరుగుదలను కనబరిచింది.అంటే లక్ష మంది కొత్తగా సిక్కును తమ జాతిగా సెలెక్ట్ చేసుకున్నారు.2021లో మొత్తం జనాభా పెరుగుదల 6.3 శాతంగా ఉండగా, ఆ మొత్తం పాపులేషన్ పెరుగుదలను సిక్కుల జనాభా అధిగమించింది.

సిక్కులను జాతి లేదా మతం ద్వారా గుర్తించవచ్చు.డేటాలో 99.7% మంది మతం ఎంపికగా సిక్కు అని పేర్కొన్నారు.అయితే 0.3% మంది జాతి ప్రదేశంలో “సిక్కు( Sikhs )” అని రాశారు, 18.6% మంది రెండింటినీ సిక్కుగా పేర్కొన్నారు.జాతిలో “సిక్కు” అని రాసే వారిలో, 55.4% మంది తమ మతాన్ని నివేదించలేదు.ఇతరులు వేర్వేరు మతాలను నివేదించారు.

సిక్కు సమాఖ్య ( UK ) ఎంపికలు అన్యాయమని వాదిస్తూ, జాతిలో “సిక్కు” అని రాయడాన్ని సమర్థించింది.వారు యూకేలో సుమారుగా 9,00,000 మంది సిక్కులు ఉన్నారని, జనాభా గణన డేటాకు భిన్నంగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఈ డేటా మరిన్ని వివరాలను కూడా వెల్లడించింది.వాటి ప్రకారం, గృహ యాజమాన్య రేటు 77.7 శాతానికి పెరిగింది.వివాహ రేటు 61 శాతానికి, ఎటువంటి అర్హతలు లేని వ్యక్తుల సంఖ్య 29.2 శాతానికి ఎగ బాకింది.ఇంగ్లాండ్, వేల్స్‌లో 63.9% సిక్కులు తాము మాట్లాడే భాషగా పంజాబీని ఎంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube