బయోపిక్‌కు వంద కోట్లు ఎందుకు బాసూ?

ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి.చాలా వరకు బయోపిక్‌లు మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి.

 100 Crores For Talaivi Movie Budjet-TeluguStop.com

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడివ్వడం వల్ల బయోపిక్‌లను ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.కాని బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌లు కూడా తీవ్రంగా నిరాశ పర్చాయి.

సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లిన నందమూరి తారక రామారావు కథతో ఆ సినిమాను తెరకెక్కించారు.ఆ సినిమా వల్ల నిర్మాతగా బాలయ్యకు పాతిక కోట్ల వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu Talaivi Budjet, Aravinda Swamy, Kangana Ranauth, Madhu Bala, Ntr Biopic,

ఇప్పుడు అదే తరహాలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లి వెలుగు వెలిగిన జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ప్రముఖ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను ఏకంగా వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.బయోపిక్‌కు వంద కోట్ల బడ్జెట్‌ పెట్టడం ఇండియాలో ఇదే ప్రథమం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Telugu Talaivi Budjet, Aravinda Swamy, Kangana Ranauth, Madhu Bala, Ntr Biopic,

బయోపిక్‌కు వంద కోట్ల బడ్జెట్‌ పెట్టడం వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండవంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తమిళంతో పాటు హిందీ తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు.కాని ఈ బయోపిక్‌కు హిందీలో అంత క్రేజ్‌ లేదు.అయినా కూడా అక్కడి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని 100 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మరి వంద కోట్లను అమ్మగా కంగనా తీసుకు వస్తుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube