జాంబీ రెడ్డి సీక్వెల్ బడ్జెట్ అన్ని వందల కోట్లా.. ప్రశాంత్ వర్మ ప్లాన్ అలా ఉండనుందా?

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబిరెడ్డి( Zombie Reddy ).

తేజా సజ్జా ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.అప్పటి దాకా టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని జాంబీ హారర్ కు రాయలసీమ కామెడీని కలగలిపి చేసిన ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందించింది.

సోలో హీరోగా తేజ సజ్జ ఫిల్మోగ్రఫీలో మొదటి హిట్టు పడింది.ఇదంతా జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయి.

ఈ సినిమా తర్వాత మళ్లీ తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

100 Crore Budget For Zombie Reddys Sequel, Zombie Reddy, Teja Sajja, Tollywood,
Advertisement
100 Crore Budget For Zombie Reddys Sequel, Zombie Reddy, Teja Sajja, Tollywood,

అయితే అభిమానులు ఇప్పుడు సీక్వెల్ కోసం డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రశాంత్ వర్మ వర్క్ చేయడమే తప్ప బయటకి చెప్పడం జరగలేదు.ఇప్పుడు ఆ దిశగా చర్యలు జరుగుతున్నట్టు సమాచారం.హీరో తప్ప ఈసారి దర్శకుడు, బడ్జెట్ వగైరాలు మారబోతున్నాయట.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రానా నాయుడు ఫేమ్ సుపర్న్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి 2( Zombie Reddy 2 ) కోసం సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం.ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టీమ్ ఫైనల్ టచ్ అప్ పనుల్లో బిజీగా ఉందని టాక్.

ఈసారి కథని కేవలం సీమకే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ నగరాల్లో జాంబీలు విరుచుకుపడితే అప్పుడు హీరో ఏం చేశాడనే పాయింట్ మీద రూపొందుతుందని వినిపిస్తోంది.

100 Crore Budget For Zombie Reddys Sequel, Zombie Reddy, Teja Sajja, Tollywood,

బడ్జెట్, స్కేల్, క్యాస్టింగ్ తదితర విషయాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో సర్ప్రైజులు ఉండబోతున్నాయట.హనుమాన్ తర్వాత కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న తేజ సజ్జ నెక్స్ట్ సినిమా మిరాయ్ ఆగస్ట్ 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే.దీని కోసం కుర్రాడు ఏకంగా రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి

ఆ తర్వాత జాంబీ రెడ్డి 2 ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మరి జాంబీ రెడ్డి సీక్వెల్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు