నేటి గ్రీవెన్స్ డే కార్యక్రమానికి 10 ఫిర్యాదులు...!

సూర్యాపేట జిల్లా:ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.

బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 10 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి,వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.బాధితులకు సత్వర భరోసా కల్పించాలని ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

10 Complaints For Today's Grievance Day Program...!-నేటి గ్ర�

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడినా,చట్టాన్ని ఉల్లంఘించే విధంగా కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు