స్వామివారికి స్వర్ణ రథం

యాదాద్రి జిల్లా:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ రథం సిద్ధమైంది.

దాతలు హైదరాబాద్‌కు చెందిన శ్రీలోగిళ్లు,ల్యాండ్‌మార్క్‌ డెవలపర్స్‌ సంస్థల ఆధ్వర్యంలో చెన్నైలో రూపొందించిన స్వర్ణ కవచాలను గతంలోని టేకు రథానికి అమర్చారు.

పసిడి శోభ సంతరించుకున్న రథానికి దాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి బాలాలయంలో పూజలు చేశారు.అనంతరం దేవస్థానం ఈవో గీత,ప్రధాన పూజారి లక్ష్మీనరసింహచార్యలకు అప్పగించారు.సుమారు రూ.75 లక్షల విలువైన బంగారంతో కవచాలు తయారు చేయించామని దాతలు తెలిపారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బాలాలయంలో చేపట్టనున్న రథోత్సవంలో పుత్తడి రథంపై యాదాద్రీశులు భక్తులకు దర్శనమిస్తారని ఈవో గీత వెల్లడించారు.

Golden Chariot For Swami-స్వామివారికి స్వర్ణ

తాజా వార్తలు