షాక్ లో క్రికెట్ ప్రపంచం , సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటన

సౌత్ ఆఫ్రికా జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ ప్రేక్షకులకు సడన్ షాక్ ఇచ్చాడు.ఇటీవలే ఆర్ సి బి తరుపున ప్రాతినిధ్యం వవహించి మంచి ఫార్మ్ ని కొనసాగించాడు అయితే తాను అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్న అని ప్రకటించి షాక్ ఇచ్చాడు.

34 ఏళ్ల డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా తరుపున 114 టెస్ట్ లు , 228 వన్డే లు , 78 టీ 20 లో ఆడాడు.

Ab De Villiers Announces Retirement From International Cricket

రిటైర్మెంట్ ప్రకటన

నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను.114 టెస్ట్ లు 228 వన్డే లు ఆడాను.ఇక యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.

నేను చాలా అలసిపోయాను.ఇది చాలా కఠినమైన నిర్ణయమని తెలుసు.

Advertisement
AB De Villiers Announces Retirement From International Cricket-షాక్ ల

చాలా రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.మంచి ఫామ్ లో ఉన్నపుడే తప్పుకోవలనుకున్నాను.ఇండియా ఆస్ట్రేలియా ల పైన సిరీస్ లు గెలిచాక ఇదే చక్కని సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు.14 ఏళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన కోచ్లు , సపోర్టింగ్ టీం కి డివిలియర్స్ కృతజ్ఞత తెలిపాడు.ఇక నా సౌత్ ఆఫ్రికా టీం మేట్స్ కి చాలా థాంక్స్ వాళ్ళ మద్దతు లేకుంటే నేను ఇంత స్థాయికి వచ్చేవాడిని కాదు.

నేను చాలా అలసిపోయా,ఇక నా వల్ల కాదు అనిపించింది నా నిర్ణయం అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు.విదేశాల్లో కౌంటీ లో ఆడే ఉద్దేశం లేదు ,కానీ దేశీయంగా టైటాన్స్ టీమ్ కు మాత్రం ఆడతాను అని తెలిపారు.

క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ ప్రత్యేకత

సచిన్ టెండూల్కర్ , ధోని , విరాట్ కోహ్లీ లకు భారతదేశం లో ఎంత మద్దతు అభిమానం ఉంటుందో అదే స్థాయిలో డివిలియర్స్ కి కూడా అభిమానులు ఉన్నారు.అతను బ్యాటింగ్ చేస్తూ క్రీజ్ లో ఉంటే ఎంతటి గొప్ప బౌలర్ అయిన వనికిపోతారు.

అతని షాట్ లు కూడా చాలా వెరైటీ గా ఉంటాయి.క్రికెట్ పుస్తకం లో లేని షాట్ లు ఆడడం లో డివిలియర్స్ తరువాతే ఎవరైనా.

అతనిని ముద్దుగా 360 డిగ్రీస్ అంటారు.ఐపీఎల్ లో కూడా డివిలియర్స్ ఆటకి భారత అభిమానులు ఫిదా అయిపోయారు, ఆర్సీబీ తరుపున , ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుపున సెంచరీ లు చేసాడు.150 వేగం తో బంతిని అయిన హేమ హేమ స్పిన్నర్ల బౌలింగ్ అయిన ఊచకోత కోయడం లో ఏబీ తరువాతే ఎవరైనా.

క్రికెట్ లో డివిలియర్స్ అద్భుతమైన రికార్డులు

1.వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ డివిలియర్స్ పేరు మీదే ఉంది 16 బంతుల్లో చేసాడు.2.ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150(64 బంతుల్లో) కూడా డివిలియర్స్ పేరిట ఉన్నాయి.3.ఇక ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన సౌత్ ఆఫ్రికా రికార్డ్ కూడా ఈయన పేరిట ఉన్నాయి.4.114 టెస్టుల్లో 50.67 సగటు తో 8765 పరుగులు , 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేసాడు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఎన్ని రికార్డ్ లు ఉన్న సౌత్ ఆఫ్రికా తరుపున వరల్డ్ కప్ గెలవని లోటు మిగిలిపోయింది.2015 వరల్డ్ కప్ లో తన శాయశక్తులా ప్రయత్నించారు కానీ సేమి ఫైనల్లో న్యూజిలాండ్ పైన ఓటమితో వరల్డ్ కప్ నుండి తప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు