వైసీపీలోకి ప్ర‌కాశం టీడీపీ ఎమ్మెల్యే..

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా సాగింది.

విప‌క్ష వైసీపీ నుంచి ఏకంగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 23 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు.

వీరితో పాటు ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు అయితే పార్టీ మార‌డంలో కోకొల్లులుగా ఉన్నారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అభివృద్ధి ప‌నులో, అధికార పార్టీ నేత‌ల ఒత్తిళ్ల వ‌ల్లో పార్టీ మారిన విప‌క్ష నేత‌లు ఉండొచ్చు.

ఇప్పుడు ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయ్యింది.అధికార పార్టీలో టిక్కెట్లు రాని నేత‌ల ప‌రిస్థితి ఏంటి ? అని ప్ర‌శ్నించుకుంటే ఇప్పుడు వాళ్ల‌కు వైసీపీయే పెద్ద ఆప్ష‌న్‌.ఏపీలో ఇప్ప‌టికే రివ‌ర్స్ ఆప‌రేష‌న్ స్టార్ట్ అయ్యింది.

టీడీపీలో టిక్కెట్లు రావ‌ని డిసైడ్ అయిన వాళ్ల టిక్కెట్ల హామీతో సైకిల్ ఎక్కేసే ప్ర‌క్రియ జ‌రుగుతోంది.కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి విజ‌య‌వాడ తూర్పు సీటు హామీతో జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నారు.

Advertisement

ఇక అదే జిల్లాకు చెందిన మ‌రో టీడీపీ కీల‌క నేత వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ విజ‌య‌వాడ ఎంపీ లేదా మైల‌వ‌రం అసెంబ్లీ సీటు హామీతో వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌ని టాక్‌.

తాజా వార్తలు