ఫోన్లో కంప్యూటర్ తీరు డిస్ ప్లే కావాలా?

రోజు అదే మొబైల్ వాడతాం, అవే మెను ఐకాన్లు, అవే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, అవే మోషన్ ఎఫెక్ట్స్ .

ఇలా రోజు ఉంటే ఏదో ఒక రోజు మన ఫోన్ మీద బోర్ కొడుతుంది.

కొన్నిరోజులు పోయాక ఫోన్ ఒక అవసరమే తప్ప, ఆకర్షణ కాదు.వాట్సాప్ వాడాలి కాబట్టి, ఫేస్ బుక్ వాడాలి కాబట్టి, మంచి మంచి ఫోటోలు తీసుకోవాలి కాబట్టి .ఇలా అవసరం కోసమే స్మార్ట్ ఫోన్ వాడతం.ఈ యాప్స్ 5 వేల రూపాయలకు వచ్చే స్మార్ట్ ఫోన్లో కూడా దొరుకుతాయి.

Feel Windows 10 Interface On Mobile-ఫోన్లో కంప్యూటర

కాని మనకు కొంచెం ఖరీదైన ఫోనే ఎందుకు కావాలి? ఎందుకు అంటే కొత్తరకనైన ఇంటర్ఫేస్ కోసం.ఓ కొత్త అనుభవం కోసం.

అసలు ఇంటర్ఫేస్ కోసం కొత్త మొబైల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంటర్ఫెస్ ని మార్చుకునేందుకు ఎన్నో లాంచర్స్ ఉన్నాయి కదా.Xiaomi Redmi మొబైల్స్ లో అయితే కుప్పకుప్పలుగా థీమ్స్ ఉన్నాయి.రోజుకి ఓ కొత్త థీన్ అప్లై చేసుకోని మన పాత మొబైల్ నే రోజూ కొత్తగా చూసుకోవచ్చు.

Advertisement

మిగితా బ్రాండ్స్ అలాంటి సర్వీసులు ఇవ్వడం లేదు కదా అని డిజపాయింట్ అవ్వొద్దు‌‌.ఎందుకంటే ప్లేస్టోర్ లో ఎన్నో లాంచర్స్ ఉంటాయి.అందులో ఒక వెరైటి లాంచర్ పేరు win 10 launcher.

ఇది అచ్చం windows 10 ని పోలి ఉంటుంది.దీన్ని డౌన్లోడ్ చేసుకోని, default launcher గా పెట్టుకోని ఓ పది నిమిషాలు వాడి చూడండి.

మీకు ఓ సరికొత్త అనుభూతి దొరుకుతుంది.మొబైల్ లో windows 10 ఇంస్టాల్ చేసి ఉన్న కంప్యూటర్ వాడుతున్న ఫీల్ వస్తుంది.

నచ్చితే అలానే వాడుకోండి, లేదంటే మళ్ళీ అన్ ఇంస్టాల్ చేసెయ్యండి.ఇలాంటి విండోస్ లాంచర్స్ చాలానే ఉన్నా, అందులో ది బెస్ట్ గా దీన్ని చెప్పుకోవచ్చు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

కాని యాడ్స్ రావడం ఒక్కట్టే ఇబ్బంది.కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని, మీ ఫోన్ ని ఓ సరికొత్త రూపంలో చూసుకోవాలంటే ఇది వాడి చూడండి.

Advertisement

తాజా వార్తలు