నవోదయ విద్యార్థినికి రాష్ట్ర ప్రథమ ర్యాంక్

సూర్యాపేట జిల్లా:2021-2022 విద్యా సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలలో నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన తెలుగు ప్రతిభ పరీక్షలో సూర్యాపేట పట్టణానికి చెందిన నవోదయ పాఠశాల విద్యార్థిని కె.

మనీషా (5వ తరగతి) రాష్ట్ర స్థాయిలో ప్రధమ ర్యాంక్ ను సాధించింది.

ఇందుకుగాను తెలుగు ప్రతిభ పరీక్ష నిర్వాహకులు 4000 రూపాయల నగదు బహుమతి,షీల్డ్ మరియు ప్రశంసా పత్రాన్ని హైదరాబాద్ లోని త్యాగరాయ కళా భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సినీ నిర్మాత దర్శకుడు ఆర్.నారాయణమూర్తి,దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా నిర్వాహకులు విద్యార్థినికి అందజేశారు.తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మనీషా రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించడంతో శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మారం లింగారెడ్డి విద్యార్థిని అభినందించారు.

State First Rank For Navodaya Student-నవోదయ విద్యార్�

ఈ విజయానికి సహకరించిన తెలుగు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తులసి రాజ్యలక్ష్మి,గోపయ్యను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు