తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్18, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.17

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.7.12 ల8.22

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu September 18 Wednesday 202

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu September 18 Wednesday 202

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి.ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.

వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరా.కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

దైవ కార్యక్రమంలో పాల్గొవడం మంచిది.

Advertisement

వృషభం:

ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి.

వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.వాహన అనుకూలత కలుగుతుంది.

జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు.కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి.

ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది.

సింహం:

ఈరోజు ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి.స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది.

తుల:

ఈరోజు ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి.దీర్ఘ కాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి.ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.

ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సు:

ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం:

ఈరోజు అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.సమయానికి నిద్రహారాలు ఉండవు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది.ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం:

ఈరోజు కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మీనం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

తాజా వార్తలు