టీటీడీ హైలెవల్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.భక్తుల భద్రతపై సమావేశమైన అధికారులు కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి ఊత కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్లే టూ వీలర్స్ కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఇవ్వనున్నారు.భక్తుల రక్షణ కోసం ఫారెస్ట్ సిబ్బందిని టీటీడీ నియమిస్తుంది.
దాంతోపాటు భక్తులకు ముందు, వెనుక సెక్యూరిటీ గార్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.భక్తులు సాదు జంతువులకు ఆహార పదార్ధాలు అందించడంపై నిషేధం విధించిన టీటీడీ నడక మార్గాల్లో ఉన్న హోటళ్ల వద్ద వ్యర్థ పదార్థాలు వదిలేస్తే చర్యలు తప్పవని సూచించింది.
నడక మార్గంలో ఐదు వందల కెమెరాలతో పాటు అవసరమైనప్పుడు డ్రోన్లు వాడాలని నిర్ణయించింది.అలిపిరి, గాలిగోపురం, ఏడవ మైలు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారని భూమన తెలిపారు.
ఫెన్సింగ్ ఏర్పాటుకు టీటీడీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.