జగన్ ను బీట్ చేస్తున్న పవన్

నమస్తే అక్కయ్య .నమస్తే తమ్ముడు.

నమస్తే పాపా అంటూ కనిపించిన వారందరికీ నమస్కారాలు పెడుతూ మన ప్రభుత్వం వచ్చేస్తుంది.

మీరంతా ఓట్లు వేసి నన్ను ముఖ్యమంత్రి ని చేయండి అంటూ .ఎవరు ఏ సమస్య చెప్పినా నేను ముఖ్యమంత్రి అవుతా మీ పనులు తప్పక చేస్తా అంటూ జగన్ సీఎం కుర్చీ కలలు కంటూ ఉండేవాడు.ఇప్పుడు అదే రాగం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకున్నాడు.

జగన్ కంటే ఇప్పుడు పవన్ లోనే కుర్చీ యావ ఎక్కువ కనిపిస్తోంది.

Ys Jagan Beats Pawan

కొద్దిరోజుల క్రితం వరకు పవన్ ఎప్పుడూ సీఎం అవుతా అని ఎక్కడా ప్రస్తావించలేదు.ఎప్పుడైయితే కర్ణాటక ఫలితాలు వచ్చి అక్కడ తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడని తెలిసిందో ఇక అప్పటి నుంచి పవన్ ఈ కొత్త రాగం అందుకున్నాడు.జేడీఎస్ - జనసేన వ్యూహం ఒక్కటే .తక్కువ సీట్లు వచ్చినా కుర్చీ దక్కించుకోవడమే అనే భావానికి వచ్చేసాడు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన చేస్తున్న అని ప్రకటించారు.

Advertisement
Ys Jagan Beats Pawan-జగన్ ను బీట్ చేస్తున్�

ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రజల వద్దకు వెళ్లగానే అక్కడివారంతా పెద్ద ఎత్తున సీఎం.సీఎం.సీఎం.

పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు.దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.

" నేను మీరంటున్నట్లుగా సీఎం కావాలంటే .మీమీ తల్లిదండ్రులతో నాకు ఓట్ వేయించాలి అంటూ పదే పదే చెప్తున్నాడు.ఏపీలో సీఎం కావాలంటే మెజారిటీ రావక్కర్లేదని కేవలం 30 సీట్లు గెలిస్తే చాలని పవన్ అనుకుంటున్నారట.

తన అభిమానులు - కార్యకర్తలు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటరుతో జనసేనకు ఓటు వేయిస్తే తాను సీఎం అవుతానని డైరెక్ట్ గానే చెప్తున్నాడు.జనసేన సిద్ధాంతం అధికారం కాదు కేవలం ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అంటున్న పవన్ ఇప్పుడేమో నేనే ముఖ్యమంత్రి అవుతా .నాకే ఓటు వెయ్యండి అంటూ ప్రచారం చేసుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది.పవన్ ఈ వ్యాఖ్యలతో ఏ రాజకీయ నాయకుడు భిన్నం కాదని అందరి అంతిమ లక్ష్యం అధికారం దక్కించుకోవడమే అని పవన్ మారిన తన పంథాతో నిరూపించుకుంటున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు