చనిపోవడానికి సిద్దం దేనికీ భయపడను..చంద్రబాబు పై పవన్ షాకింగ్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకి స్పందిచారు.తనపై వస్తున్న ఆరోపణలకి.

తనపై జరుగుతున్న దాడికి తీవ్రంగా స్పందిచారు.

ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు.

చంద్రబాబు పుట్టిన రోజు అనే కనికరం కూడా లేకుండా ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మరో మారు చంద్రబాబు లోకేష్ లని ఏకి పడేశారు.

పవన్ చేసిన తాజా ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది ఇంతకీ వివరాలలోకి వెళ్తే.పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.

Advertisement
Pawan Kalyan Comments On Chandrababu-చనిపోవడానికి స�

తనను ఏళ్ల తరబడి సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే లాగుతున్న ఆవేదనను వ్యక్తం చేయటమే కాదు.అంతలా వేధిస్తున్నప్పుడు పరువు పోతుందని భయపడతారా? అంటూ ప్రశ్నించారు.తనను టార్గెట్ చేస్తున్న వారు అధికారంలో ఉన్న వారు.

మీడియాను చేతిలో పట్టుకున్న వాళ్ల అంగబలం గురించి ప్రస్తావించిన పవన్.ఆత్మగౌరవంతో బతికేవాడు.

ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనికైనా భయపడతాడా?.వెనక్కి తగ్గుతాడా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

Pawan Kalyan Comments On Chandrababu

అంతేకాదు ఈ క్షణం నుంచి ఎప్పుడైనా చనిపోవటానికి సిద్ధపడే వెళుతున్నట్లుగా పవన్ సంచలన కామెంట్స్ చేశారు.తానూ ఈ పోరాటంలో మరణించినా నేను ఎంతో కొంత పోరాడి చనిపోయాను అనుకుంటే చాలు అంటూ తెలిపారు దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా.రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలాన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం సంచలనంగా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే పోరాటం మొదల్లోనే.మిగిలిన వారికి భిన్నంగా మరణం గురించి పదే పదే మాట్లాడుతున్న పవన్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.అసలు పవన్ పెట్టిన ట్వీట్ లు రెండు పరిశీలిస్తే.

Advertisement

"స్వశక్తితో జీవించేవాడు.ఆత్మగౌరవంతో బతికేవాడు.

ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికేవాళ్లని.సంవత్సరాలుగా.

సంబంధం లేని వివాదాల్లోకి పదే.పదే.వీధిలోకి.లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్న వాళ్లకి.మీడియాని చేతుల్లో పెట్టుకున్నవాళ్లకి.

అంగబలం.అర్థబలం ఉన్నవాళ్లకి.

వాళ్లు చేసే అత్యాచారాలకి.స్వశక్తితో జీవించేవాడు.

ఆత్మగౌరవంతో బతికేవాడు.ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనీకైనా భయపడతాడా? వెనకంజ వేస్తాడా?" "అందుకే నా ప్రియమైన అభిమానులకు.అక్కచెల్లెళ్లకు.

ఆడపడుచులకు.జనసైనికులకు నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.

ఈ రోజు నుంచి నేను ఏ క్షణం అయినా నేను చనిపోవటానికి సిద్ధపడి ముందుకి వెళుతున్నాను.ఒకవేళా నేను ఈ పోరాటంలో చనిపోతే.

మీరు గుర్తుంచుకోవాల్సింది.నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా.

అధికారం అనేది అండదండలు ఉన్న వారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై.ప్రజాస్వామ్యబద్ధంగా.

రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు" అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీటి పెట్టి మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది అంటున్నారు జనసేన వర్గాలు ఈ సారి ఈ ప్రెస్ మీట్ లో లోకేష్ చంద్రబాబు లని మరింతగా టార్గెట్ చేయనున్నాడట పవన్ కళ్యాణ్ మరి ముందు ముందు ఈ గొడవ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.

తాజా వార్తలు