'కన్నా'ను 'సున్నా' చేయడమెలా ..? టీడీపీ స్కెచ్ ఇదే !

ఏపీలో కొత్త రాజకీయ ఎత్తుగడలకు తెరతీసి బాబు ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.

అందుకే ఏపీలో బాబు హవా ఎలా తగ్గించాలనే విషయం మీద ప్రధానంగా దృష్టిపెట్టింది.

టీడీపీకి ప్రధానంగా వెన్నుదన్నుగా ఉంటున్న కాపు సామాజిక వర్గంపై గురిపెట్టిన బీజేపీ ఆ సామజిక వర్గం నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు పదవులు కట్టబెట్టింది.అయితే బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ .గట్టి కౌంటర్ ఎటాక్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయ్యింది.అందుకే ఇప్పుడు టీడీపీ సరికొత్త అస్త్రాలు ప్రయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Tdp Game Plan For Control Bjp In Ap

టీడీపీ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా విమర్శలు చేయకముందే ఆయన్ను బ్లేమ్ చేసి ఆయన దూకుడుకి కళ్లెం వెయ్యాలని టీడీపీ ప్లాన్.అందుకే కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉండగా చేసిన పొరపాట్లు, అవినీతి వ్యవహారాలూ, అప్పట్లో ఆయన మీద ఎలాంటి విమర్శలు వచ్చాయి? అనే విషయాలను బయటకి తీసి బీజేపీ పరువు తీయాలని టీడీపీ చూస్తోంది.కన్నా గతంలో నేదురుమిల్లి జనార్దనరెడ్డి - కోట్ల విజయభాస్కరరెడ్డి ల హయాంలోనే మంత్రిగా చేశారు.

రాజశేఖహర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.పదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆయన పదవి మాత్రం పదిలంగానే ఉంది.

Advertisement
TDP Game Plan For Control BJP In AP-కన్నా#8217;ను సున్న

అలాగే స్థానికంగా కూడా గుంటూరు జిల్లాలో కన్నామీద ఆరోపణలు ఉన్నాయా అనే విషయాలమీద ఫోకస్ పెట్టారు.ఏదో ఒక రకంగా కన్నా ను ఇరుకునపెట్టి తన పంతం తీర్చుకోవాలని టీడీపీ ఆలోచన.

దీని ద్వారా ఒక వైపు కన్నా హవాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా .బీజేపీ ఇరుకునపడేలా చెయ్యాలని తెలుగు తమ్ముళ్లు హుషారుపడుతున్నారు.ఇప్పటివరకు మోదీ మీద అస్త్రాలు సంధించిన టీడీపీ స్వరం కన్నా నియామకం జరిగిన వెంటనే ఆయనను టార్గెట్ గా చేసుకున్నారు.

అందుకే ఆయన భాజపాకు అధ్యక్షుడు అయినప్పటికీ.వైఎస్సార్ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.ఏదో రకంగా కన్నా అవినీతి వ్యవహారాలు బయటపెట్టి బీజేపీని భయపెట్టాలని టీడీపీ చూస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు