నందమూరి - ఘట్టమనేని .. ఒకే సినిమాలో?

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా హంగులు ఆర్భాటల నడుమ ఈరోజు మొదలైంది.భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.

ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి సెన్సెషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలింసిందే.ఈ క్రేజి సినిమాకి సంబంధించి మరో క్రేజి న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది.

అదేంటంటే, యువరత్న సినిమాలో సూపర్ స్టార్ ఫ్యామిలి హీరో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నాడట.ఆ హీరో ఎవరో కాదు, టాలివుడ్ లో మొదలుపెట్టి, బాలివుడ్ వైపు అడుగులేస్తున్న సుధీర్ బాబు.

ఈ యువహీరో బాలకృష్ణ సరికొత్త సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో నిజానిజాలు తెలియదు కాని, ఈరోజు జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సుధీర్ రావడంతో, ఈ వార్తలకి కొత్త సాక్ష్యం దొరికినట్లయింది.

Advertisement

చాలారోజులుగా బాలకృష్ణతో మహేష్ బాబు అనే వార్తలు వస్తున్నాయిగా, నిజానికి సుధీర్ బాబుకి బదులు మహేష్ బాబు అని పొరబడినట్టుంది మీడియా.ఇదే గనుక నిజమైతే నందమూరి - ఘట్టమనేని అభిమానులకి పండగే.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు