దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాడు.ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతూనే మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలతో దూసుకు పోతున్నాడు.
ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు అయిదు పోస్టర్లను విడుదల చేసిన జక్కన్న సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్లాడు.కొన్ని రోజుల ముందు సినిమాను జులై 10న విడుదల చేయనున్నట్లుగా చెప్పిన సమయంలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది.
అందులో భాగంగా మే 31న ‘బాహుబలి’ ట్రైలర్‌ను విడుదల చేస్తాను అంటూ జక్కన్న ప్రకటించాడు.అయితే ఆ ప్రకటనలో చిన్న మార్పు చేసి, అదే తేదీన అంటే మే 31న ‘బాహుబలి’ ఆడియోను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొదటగా భావించిన దారి ప్రకారం మే 31న ట్రైలర్ ఆ తర్వాత జూన్ మొదటి లేదా రెండవ వారంలో ఆడియోను విడుదల చేయాలని భావించారు.కాని ఆడియో మరియు ట్రైలర్ ఒకే సారి చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆడియో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ అతిరథ మహారథులను ఆహ్వానించబోతున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్‌లుగా నటించారు.శోభుయార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలు ఈ సినిమాను నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.







