కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ మంచి జోష్ లో ఉన్నాడు.నిఖిల్ చేస్తున్న సినిమాలకు సూపర్ బజ్ ఏర్పడింది.
అంతేకాదు నిఖిల్ పూర్తి చేసిన 18 పేజెస్ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సుకుమార్ కథ అందించిన ఈ సినిమా సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు.కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే ఓటీటీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా భారీ ఆఫర్ వచ్చిందట.ఈ రెండిటితోనే సినిమా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.ఇక ఇప్పుడు థియేట్రికల్ రిలీ మొత్తం లాభాలే అని తెలుస్తుంది.18 పేజెస్ సినిమాకు హిందీ నుంచి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.కార్తికేయ 2 క్రేజ్ తో ఈ సినిమాని హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్మేస్తున్నారని టాక్.
మొత్తానికి కార్తికేయ 2 తో నిఖిల్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. సుకుమార్ పుష్ప బ్రాండ్.ఇంకా నిఖిల్ కార్తికేయ 2 క్రేజ్ రెండు కలిపి 18 పేజెస్ సినిమాకు సూపర్ బిజినెస్ అందించేలా ఉంది.