నిఖిల్ సినిమాకు భారీ బిజినెస్..!

కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ మంచి జోష్ లో ఉన్నాడు.

నిఖిల్ చేస్తున్న సినిమాలకు సూపర్ బజ్ ఏర్పడింది.అంతేకాదు నిఖిల్ పూర్తి చేసిన 18 పేజెస్ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సుకుమార్ కథ అందించిన ఈ సినిమా సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు.

కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఓటీటీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా భారీ ఆఫర్ వచ్చిందట.

ఈ రెండిటితోనే సినిమా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.ఇక ఇప్పుడు థియేట్రికల్ రిలీ మొత్తం లాభాలే అని తెలుస్తుంది.

18 పేజెస్ సినిమాకు హిందీ నుంచి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.

కార్తికేయ 2 క్రేజ్ తో ఈ సినిమాని హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్మేస్తున్నారని టాక్.

మొత్తానికి కార్తికేయ 2 తో నిఖిల్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. సుకుమార్ పుష్ప బ్రాండ్.

ఇంకా నిఖిల్ కార్తికేయ 2 క్రేజ్ రెండు కలిపి 18 పేజెస్ సినిమాకు సూపర్ బిజినెస్ అందించేలా ఉంది.

పంజాబ్ కింగ్స్ ఓటమికి ముంబై గెలుపుకి ఇదెక్కోటే కారణం…