ఆసిన్. పదిహేనో ఏటనే సినిమా ఇండస్ట్రీ కి ఎంటర్ అయ్యి సౌత్ ఇండియాలోని అందరి అగ్ర హీరోల సరసన నటించింది.
భారత నాట్య డ్యాన్సర్ అయినా ఆసిన్ సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ముందు మోడలింగ్ కూడా చేసింది.మొదట మలయాళ సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అయ్యి తెలుగు, తమిళ భాషల్లో బాగా పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత హిందీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే తన చివరి సినిమా వరకు నటించింది.ముఖ్యంగా ఆమె ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.
తమిళ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా కూడా ఎదిగింది.
క్వీన్ అఫ్ కోలీవుడ్ అంటూ అప్పట్లో మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేది.
కానీ ఆమె గజినీ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో అదే సినిమాను హిందీ లో అమీర్ ఖాన్ చేయాలనీ భావించి ఆసిన్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు .దాంతో ఆమె బాలీవుడ్ డెబ్యూ అమీర్ ఖాన్ తో జరిగింది.అక్కడ కొన్నాళ్ల పాటు ఆమె కొన్ని సినిమాల్లో నటించింది.కానీ ఒక్క సారిగా బాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీ పెరిగిన తర్వాత మళ్లి సౌత్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు.
నిత్యం బాలీవుడ్ లో కాంట్రవర్సీలతో కాలం గడిపింది.ఆలా ఆమె ఎక్కువగా కో-స్టార్స్ తో చనువుగా ఉండేది కాదు.
ఇక గజినీ సినిమా టైం లో సైతం ఆమె నటి జియా ఖాన్ తో ఫైటింగ్ కి దిగినట్టుగా అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
ఒక రోజు గజినీ సినిమా కోసం జియా ఖాన్ షూట్ చేస్తున్న సమయంలో, అదే స్టూడియో లో ఆసిన్ ఒక ప్రోమో షూట్ కి ఉంది.అయితే ఆమె ప్రోమో షూట్ పూర్తయిన వెంటనే వెళ్లిపోకుండా అక్కడే ఉండి, షూట్ కి అంతరాయం కలిగించి సిబ్బందికి ఇబ్బంది కలిగించాడట.అయితే ఆమె వెళ్లిపోకుండా ఉండటానికి గల కారణం జియా ఖాన్ ఎలా చేస్తుందో చూడాలని మాత్రమే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం కొసమెరుపు.
కానీ జియా ఖాన్ మాత్రం ఆసిన్ కి తన పైన ఉన్న అక్కసు తోనే ఆలా తన షూట్ ని డిస్టర్బ్ చేసిందని మొయిద ముందు చెప్పింది.ఇలా జియా మరియు ఆసిన్ యుద్ధం అప్పట్లో సంచలనం సృష్టించింది.