రాయన్ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చిన మహేష్ .. ఆ ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అందులో బాగానే మహేష్ బాబు చివరగా గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదనిపించింది.

ఇక ఆ సంగతి పక్కన పెడితే.మహేష్ బాబు తన తదుపరి సినిమాను టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళితో( Rajamouli ) చేయబోతున్న విషయం తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు రానుంది.

Zero Ego Mahesh Babu Kollywood Audience Comments Details, Mahesh Babu, Kollywood
Advertisement
Zero Ego Mahesh Babu Kollywood Audience Comments Details, Mahesh Babu, Kollywood

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.అయితే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పట్టా లెక్కనుండగా ఈలోపు మహేష్ బాబు తన సమయాన్ని ఫ్యామిలీ తోను తన సినిమా కోసం పలు సినిమాలు కూడా చూసేందుకు వెచ్చిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ రీసెంట్ మూవీ అయినా రాయన్ సినిమా( Raayan ) చూసిన మహేష్ బాబు ఈ సినిమా పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

ధనుష్( Dhanush ) నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాని మహేష్ బాబు ఎంతగానో ప్రశంసించారు.దీనితో తమిళ ఆడియెన్స్ ఇపుడు సోషల్ మీడియాలో మహేష్ విశాల హృదయానికి ఫిదా అయ్యిపోయారు.

Zero Ego Mahesh Babu Kollywood Audience Comments Details, Mahesh Babu, Kollywood

ఎలాంటి ఈగో లేకుండా అది కూడ పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాని ప్రశంసించడం ఆనందంగా ఉందని, కోలీవుడ్ నుంచే ఎంతోమంది ఉన్నప్పటికీ సినిమా కోసం మాట్లాడలేదు అని మహేష్ విషయంలో తమిళ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉండగా మహేష్ ఇచ్చిన రివ్యూ పై ధనుష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన టీం అంతా ఎంతో థ్రిల్ అయ్యామని తనకి రిప్లై ఇచ్చారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు