జీ సూపర్ ఫ్యామిలీ గ్రాండ్ ఫినాలే, మహేష్-సితారల డాన్స్ ఇండియా డాన్స్ సరికొత్త ఎపిసోడ్ తో అలరించనున్న జీ తెలుగు

హైదరాబాద్, సెప్టెంబర్ 7, 2022: అద్భుతమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో మరియు స్పెషల్, ఈవెంట్స్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో జీ తెలుగు ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఐతే, 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించిన కేజిఎఫ్-చాప్టర్ 2 యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో ఇటీవలే టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ ప్రముఖ ఛానల్, ఇప్పుడు మరో అద్భుతమైన దృశ్యకావ్యాన్ని వారి ముందుకు తేనుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన RRR చిత్రాన్ని సెప్టెంబర్ 11న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు హిందీ భాషలో ప్రసారం చేయనుంది.అంతేకాకుండా, మీ వారాంతానికి రెట్టింపు ఆనందాన్ని జోడిస్తూ జీ సూపర్ ఫ్యామిలీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ని మధ్యాహ్నం 12 గంటలకు మరియు మహేష్ బాబు-సితార కలిసి పాల్గొన్న డాన్స్ ఇండియా డాన్స్-తెలుగు షో యొక్క మరో ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది మీ జీ తెలుగు.

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ భీం మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలలో అద్భుతమైన నటన కనబరచగా, అజయ్ దేవగన్ (వెంకట రామరాజు), అలియా భట్ (సీత), మరియు ఒలీవియా మోరిస్ (జెన్నిఫర్) తమదైన శైలిలో ఆకట్టుకున్నారు.

ఈ కథలోని, మలుపులు, ఎమోషనల్ డ్రామా, మరియు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలుగజేయనున్నాయి.RRR ప్రసారానికి కొన్ని గంటల ముందు జీ సూపర్ ఫ్యామిలీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ముత్యమంత ముద్దు, గుండమ్మ కథ, కల్యాణ వైభోగం, మరియు అగ్నిపరీక్ష కు చెందిన టీమ్స్ పోటీపడనున్నాయి.

Advertisement

వీరిలో ఎవరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ని నెగ్గుతారో తెలియాలంటే మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించాల్సిందే! కేవలం ఆటలే కాకుండా, ఆమని మరియు స్నిగ్ద, యొక్క సింగింగ్ యాక్ట్స్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనున్నాయి.ఇక, మీ వారాంతానికి బ్లాక్బస్టర్ ముగింపు పలకడానికి డాన్స్ ఇండియా డాన్స్-తెలుగు మరో కొత్త ఎపిసోడ్ తో రాత్రి 9 గంటలకు మీ ముందుకు రానుంది.

గతవారంలాగే, ఈ వారం కూడా షో లో మహేష్-సితారల సందడి అందరిని ఆకట్టుకోనుంది.

Advertisement

తాజా వార్తలు