యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్..మంత్రి కాకాణి

టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు లక్ష్యం, ఉద్దేశం లేవని విమర్శించారు.

యువగళం పాదయాత్రలో యువకులు లేరన్న మంత్రి కాకాణి అందరూ ముసలివారేనని తెలిపారు.లోకేశ్ పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు పోలిక లేదన్నారు.

జిల్లాలో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలే పాదయాత్రకు వెళ్లారని చెప్పారు.కానీ వారి వెంట పార్టీ క్యాడర్ వెళ్లలేదని పేర్కొన్నారు.

బీజేపీతో దోస్తీకి చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...

Latest Latest News - Telugu News