పవన్ ను దోమతో పోల్చిన వైసీపీ ఎంపి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

గత కొద్ది రోజులుగా జగన్ మీద పవన్ కామెంట్ చేయడం, తిరిగి పవన్ జగన్ తో పాటు వైసీపీ నాయకులను కామెంట్ చేయడం, నిత్యకృత్యంగా మారిపోయింది.

ప్రతిపక్ష టిడిపిని విమర్శించే తీరుకంటే ఎక్కువ స్థాయిలో జనసేన ను వైసీపీ టార్గెట్ చేస్తోంది.ఈ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉంటున్నారు.

Ysrcp Mp Vijayasaireddi Compared Pavan To Mosquito-పవన్ ను దో�

ట్విట్టర్ ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి.గత కొద్దిరోజులుగా పవన్ ను ఉద్దేశించి వరుస వరుసగా ట్విట్లు పెడుతున్నారు.

అందులో భాగంగానే ఈ రోజు పవన్ ను డెంగ్యూ దోమ తో పోలుస్తూ పరువు తీశారు."నిత్య కళ్యాణం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు అంటే, సీజనల్ గా వచ్చిపోయే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తి చేసి దోమలు వర్షాకాలంలో ఎగిరెగిరి శీతాకాలంలో చల్లబడి వేసవి లో కనిపించకుండా పోతాడట.

Advertisement

ఇన్నాళ్లు నడిచింది ఏమో కానీ ఇకపై దోమలకు కష్టకాలమే అంటూ విజయ సాయి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.అలాగే మరో పోస్ట్ లో దళితులకు రాజకీయాలు ఎందుకు అంటూ బండ బూతులు తిట్టిన చింతమనేని కి, బలహీన వర్గాల బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్ లకు ఏం తేడా లేదు.

వీళ్లకు నిమ్న వర్గాలు అంటే చాలా చిన్నచూపు.ఎన్నికల్లో చిత్తుగా ఓడించినందుకు ఇంకా కసి పెంచుకున్నారు అంటూ విజయసాయి సెటైర్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు