జగన్ కు రాజు గారు పవన్ కు రాపాక ! ఇద్దరూ ఇద్దరే ?

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.151 సీట్లతో పాటు, అదనంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేల మద్దతుతో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదురు లేకుండా ముందుకు వెళ్తోంది.

జగన్ తాను అనుకున్న పనులు అన్నిటిని చక్కబెట్టుకుంటూనే, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

దీంతో పాటు, తమకు అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వస్తున్న జనసేన పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే అయినా, ఆ పార్టీ అధినేత పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ స్థాయిలోనే విమర్శలు చేస్తున్న తీరు వైసీపీకి ఆగ్రహం కలిగిస్తోంది.ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను తమవైపు తిప్పుకోవడంలో అధికార పార్టీ సక్సెస్ అయింది.

రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలోనే ఉంటూ, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతూ, సొంత పార్టీపై విమర్శలు చేస్తూ వస్తుండడం జనసేన కు మింగుడు పడడం లేదు.జగన్ ఫోటో కు పాలాభిషేకం చేయడం దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ, జగన్ తీరు పొగుడుతూ వస్తుండడం జనసేన కు బాగా ఇబ్బందికరంగా మారింది.

అయినా ఆయనను సస్పెండ్ చేయకుండా, వేచి చూసే ధోరణిలోనే పవన్ ఉన్నారు.కానీ పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం చాలానే జరిగిపోతూ వస్తోంది.ఈ విషయంలో ఏం చేయాలనే విషయంపై జనసేన కు కూడా క్లారిటీ లేదు.

Advertisement

ఇదిలా ఉంటే, వైసీపీ కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నరసాపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.సొంత పార్టీలోనే ఉంటూ, నిత్యం పార్టీ పరువు తీసే విధంగా ఆయన విమర్శలు చేస్తూ ఉండటం వంటివి జగన్ కు ఆ పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది.

ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.రఘురామకష్ణంరాజు ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయకుండా, వేచి చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో, ఆయన మరింతగా పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

సరిగ్గా జనసేన లో రాపాక వ్యవహారం ఏవిధంగా అయితే ఉందో, అదేవిధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలోనూ ఉండడంతో ఈ రెండు పార్టీలు ఈ ఇద్దరు నాయకుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు