వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి బెయిల్ పిటిషన్‎పై విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్‎ను తిరస్కరించింది.

హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం.బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది.ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది తెలిపారు.అప్రూవర్ గా మారిన వాచ్ మెన్ స్టేట్ మెంట్ లో కూడా ఆయన పేరు లేదని వెల్లడించారు.

అయినా ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.పిటిషన్‌ను తిరస్కరించింది.ఇప్పటికే శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement