మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి..

కడప జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు.

తాను మేజిస్ట్రేట్ ముందు రెండుసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు పూర్తిగా రక్షణ కల్పించాలని మీడియా ముందు పోలీసులను కోరారు.

గతంలో తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరానని కానీ కేవలం ఒక్క కానిస్టేబుల్ ను మాత్రమే తనకు రక్షణగా ఇచ్చారని తనకు మరింత భద్రత కల్పించాలని కోరాడు.తాను డబ్బులు ఇస్తే అప్రూవర్ గా మారనని మీడియాలో కథనాలు వస్తున్నాయని కానీ నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదని కేవలం నా భార్యా బిడ్డల కోసమే అప్రూవర్ గా మారనని మీడియా ముందు వెల్లడించారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు