టీడీపీలోకి వివేకా కూతురు.. సిగ్గు చేటు

వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైకాపా యొక్క ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం హత్య కేసులో ఉంది అంటూ సిబిఐ అనుమానిస్తోంది.

ఇప్పటికే పలు దఫాలుగా అవినాష్ రెడ్డిని విచారించడం జరిగింది.మరో వైపు వివేకానంద రెడ్డి( Y.S.Vivekananda Reddy ) కూతురు సునీత రెడ్డి( Sunitha reddy ) తన తండ్రి హత్య కేసు విషయం లో చాలా సీరియస్ గా ఉంది.

Ys Sunitha Reddy Political Entry Soon , Ap Politics , Ys Sunitha Reddy , Ysr ,

సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఈ కేసు విచారణకు సంబంధించి వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారణ వేగవంతం అయింది.ఇక ఇదే సమయం లో సునీత రెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.

Ys Sunitha Reddy Political Entry Soon , Ap Politics , Ys Sunitha Reddy , Ysr ,

ఆమె తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అవ్వబోతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.ఈ నేపథ్యం లో ఆమె పై వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు వైయస్ వివేకానంద రెడ్డి, హోరా హోరీగా పోరాడారు.

Advertisement
Ys Sunitha Reddy Political Entry Soon , Ap Politics , Ys Sunitha Reddy , Ysr ,

చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu).వివేకానంద రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

Ys Sunitha Reddy Political Entry Soon , Ap Politics , Ys Sunitha Reddy , Ysr ,

అలాంటి చంద్రబాబు నాయుడు పార్టీ లో సునీత రెడ్డి ఎలా జాయిన్ అవుతారు అంటూ వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.రాజకీయ లబ్ధి కోసమే తండ్రి హత్య కేసుని అడ్డం పెట్టుకుంటుందా అంటూ సునీత పై కొందరు వైకాపా నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.మరో వైపు సునీత రెడ్డి కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఆమె ఏ పార్టీ లో జాయిన్ అయి కడప పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేస్తుంది అనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు