సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల..!!

వైయస్ షర్మిల ( YS Sharmila )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో( Revanth Reddy ) భేటీ అయ్యారు.

ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి తన కుమారుడి పెళ్లికి.

రావాలని శుభలేఖ అందించినట్లు సమాచారం.వైయస్ షర్మిల కొడుకు వైయస్ రాజారెడ్డి( YS Raja Reddy ) నిశ్చితార్థం జనవరి 18వ తారీకు జరగనుండగా.

ఫిబ్రవరి 17వ తారీకు వివాహం జరగనుంది.కొడుకు పెళ్లికి సంబంధించిన ఇప్పటికే ఏపీలో సోదరుడు సీఎం వైఎస్ జగన్ కి శుభలేఖ అందించి ఆహ్వానించడం జరిగింది.

జనవరి మూడవ తారీకు కొడుకు రాజారెడ్డితో పాటు తల్లి వైయస్ విజయమ్మతో కలిసి తాడేపల్లిలో అన్న వైఎస్ జగన్ కి శుభలేఖ అందించారు.

Advertisement

అనంతరం తర్వాత రోజు జనవరి 4వ తారీఖు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో( Congress party ) జాయిన్ కావడం జరిగింది.ఢిల్లీలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన.

ఎక్కడ పనిచేయమన్న తాను సిద్ధంగా ఉన్నట్లు షర్మిల తెలియజేశారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన తండ్రి కల అని తెలియజేశారు.

తాను కూడా ఆ రకంగానే తన తండ్రి కల కోసం కృషి చేస్తానని అన్నారు.దేశంలోనే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల ప్రసంగించారు.

అనంతరం నిన్న ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న షర్మిల నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కొడుకు పెళ్లికి రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు