ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.

నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

"న్యాయ యాత్ర"( Nyaya Yatra ) పేరిట షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.తాజాగా వైయస్ షర్మిల( YS Sharmila ) సోషల్ మీడియాలో వైయస్ జగన్ పై సీరియస్ పోస్ట్ పెట్టారు.

"ఏపీ న్యాయ యాత్ర లో బాగంగా బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.YSR గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

Advertisement

కాంగ్రెస్ తరుపున 10 ఎన్నికల్లో గెలిచారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.ఎన్నో అద్భుతాలు చేశారు.

ఆయన ఆశయం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉంది.

ముఖ్యమంత్రి జగన్( CM YS Jagan ) పాలనలో విభజన హామీలు ఒక్కటి కూడా సాదించుకోలేదు కానీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనల ప్రాజెక్ట్ చేశారు.

బీజేపీ( BJP ) దగ్గర జగన్ ఒక బానిసలా మారారు.కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇదే కడప జిల్లా నా పుట్టినిల్లు.ఇక్కడ జమ్మలమడుగు లోనే పుట్టా.

Advertisement

ఇవ్వాళ మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది.మీ దీవెనలతో ఆశీర్వదించండి గెలిపించండి".

అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.

తాజా వార్తలు