గందరగోళంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ

శాసన సభ అన్నాక ఇలా ఏదో ఒక రగడ, ఏదో ఒక జగడం ఉండనే ఉంటాయి.

ఎందుకంటె ఇందులో ప్రధాన పక్షం ఉక్కుపాదం తో అణిచేసింది లెదు.

అలాగే సర్కార్ ను ఇరుకులో పెట్టేసింది.ఇక ఏ క్షణమైనా అధికారం పోయేది లేదు అలాంటి పరిస్థితి కల్పించే ప్రతిపక్షం నేటికి ఏ శాసనసభలో లేదు అనేది నిజం.

కేవలం ప్రధానంగా ఇరు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలకు వేదికగా నేటి అసెంబ్లీ ఉందనేది పక్కా నిజం.ఈదానికి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం నువ్వెంత అంటే నువ్వెంత అని ఏమి కానట్లు కాట్లాడుకోవడమే.

నేడు బడ్జెట్ సమావేశం రసా భాస అయ్యింది .స్పీకర్ 8మందిని 3రోజులు సభ నుంచి సస్పెండ్ చెసెసారు.ఈ దానికి ప్రతిపక్షం మా గొంతులు నొక్కేస్తున్నారు అని గగ్గోలు పెట్టడం పాత విధానమె.

Advertisement

ప్రధాన పక్షం ప్రతి పక్షం లేకుండా సభ అయ్యిన్దనిపించుకోవడం తో సరి పెట్టేసారు .ఇదంతా రొటీన్ వ్యవహారమే .శాసనసభ నేడు ప్రతిపక్ష సభ్యులు 8మంది సస్పెన్షన్ తో గందరగోలమయ్యింది .జగన్ తాను రైతులతో మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం ఏమిటి అని స్పీకర్ ను నిలదీసి అయ్యా మీసభకు ఒక దండం మీకు ఒక దండం అని చెప్పి తన మందితో సభలోంచి నిష్క్రమించారు .ఆ తర్వాత సభ నడిచేసింది .ఇదంతా రొటీన్ వ్యవహారమే .ప్రతిపక్షం కు ఉండాల్సిన మీడియా దండిగా ఉన్నందున ఇక టీవి మైకుల్లో సర్కార్ ఇలా చేసింది అలా చేసింది అని చెప్పుకోవడం ఎప్పటిలానే పరిపాటయ్యింది .సర్కార్ లో ఉన్న పార్టికి కూడా దండిగా మీడియా సపోర్టు ఉండనే ఉంది .వారు జగన్ సభను భ్రస్టు పట్టించేసాడు అని రకరకా కథనాలతో వారి కథనాలు వారు వండి వార్చేయడం లో వీసమెత్తు తగ్గుటలేదు .ఇది ఏపి శాసన సభ ప్రజల ముందు లైవులో దర్శనమిస్తోంది .

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు