వైయస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) రేపటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మరియు పోటీ చేసిన అభ్యర్థులతో 22వ తారీఖున తాడేపల్లిలో సమావేశం కావాలని భావించారు.

కానీ అనూహ్యంగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి.వైయస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడటం జరిగింది.

విషయంలోకి వెళ్తే ఈనెల 21, 22 తేదీలలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా వేసుకోవటం జరిగింది.ఇదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో 22న జరగాల్సిన విస్తృతస్థాయి సమావేశం ఎల్లుండి నిర్వహించబోతున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓటమి చెందింది.11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.

Advertisement

ఇటువంటి పరిస్థితులలో వైఎస్ జగన్ ఫలితాలు అనంతరం ఓటమిపై పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ఇదే సమయంలో ప్రజా సమస్యల విషయంలో ఏ రకంగా పోరాడాలి అన్నదానిపై కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు.

అదేవిధంగా ఫలితాలు అనంతరం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులలో గాయపడిన వారిని అదేవిధంగా మరణించిన వారిని పలకరించడానికి కూడా సిద్ధపడటం జరిగింది.అయితే ముందుగా అసెంబ్లీ సమావేశాలు( Assembly meetings ) జరుగుతున్న క్రమంలో.

రేపు వైయస్ జగన్ వెళ్లాల్సిన పులివెందుల పర్యటన వాయిదా పడటం జరిగింది.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు