స్పెషల్ స్టేటస్ పై జగన్ స్పెషల్ రిక్వెస్ట్ చేయలేదా ?

ఏపీకి ప్రత్యేక హోదా ! ఇదే అంశంపై రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ సీరియస్ గానే పోరాటం చేసాడు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అనేక దీక్షలు పార్టీ తరపున చేపట్టారు.

ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లి ఆందోళన చేసాడు.వైసీపీ ఈ దీక్షలు చేస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా వైసీపీని ఇబ్బందులకు గురిచేసింది.

అయినా ఏపీకి ప్రత్యేక హోదా అనే నినాదం మాత్రం జగన్ విడిచిపెట్టలేదు.ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయాయి.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.కేంద్రంలో అదే బీజీపీ మళ్లీ అధికారం దక్కించుకుంది.

Advertisement

మోదీ తో జగన్ స్నేహంగా కూడా ఉంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో రెండోసారి ప్రధాన మంత్రి అయిన తరువాత మొదటిసారి తిరుపతికి ప్రధాని వచ్చారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఏదైనా స్తతెమెంత్ మోదీ నుంచి వస్తుందేమో అని అంతా భావించారు.

ఏపీకి రావాల్సిన నిధులు, ప్రయోజనాలు ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో.ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దించడమో, నిలదీయడమో చేయడం మర్చిపోయారు.తిరుమలలో ఆలయంలోకి వెళ్తున్న సమయంలో వాళ్లిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్లుగా కనిపించినా అదేమీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని అర్ధం అయిపొయింది.

ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి నివేదికలు కానీ, ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనలు కానీ జగన్ తరఫు నుంచి అందలేదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

వాస్తవానికి ప్రధాని ఏపీ పర్యటన ఖరారయిన తర్వాత, ఆర్థిక శాఖ అధికారులు ఓ వినతి పత్రాన్ని రూపొందించినట్లు ప్రచారం జరిగింది.దాని ప్రకారం దాదాపు రూ 75వేల కోట్లు.కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయాలనే ప్రతిపాదనతో వినతి పత్రం తయారు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

కానీ ఎక్కడా అటువంటి వినతిపత్రాన్ని జగన్ ప్రధానికి ఇచ్చినట్లుగా కనిపించలేదు.అసలు ముందుగా మోదీతో జగన్ భేటీ ఉంటుందన్న ప్రచారం కూడా పెద్దఎత్తున జరిగింది.అయితే అధికారికంగా ఎటువంటి భేటీ ఏర్పాటు చేయలేదు.

మోదీని జగన్ ప్రోటోకాల్ ప్రకారమే కలిశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి జగన్ ఎటువంటి ఆసక్తి కనబరచలేదు అనే విమర్శలు కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాయి.

తాజా వార్తలు