ఓహో మంత్రి పదవి రేసులో వీరూ ఉన్నారా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో పార్టీ శ్రేణులతో పాటు ఏపీ సీఎం జగన్ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎన్నికలను జరిపించి తీరాలన్న కసితో జగన్ ఉన్నారు.

కరోనా వైరస్ ను కారణంగా చూపించి ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వ్యవహారాలన్నీ ఈ విధంగా ఉంటే, ఏపీలో ఎమ్మెల్సీ పదవి ద్వారా ఇద్దరు మంత్రి పదవులు పొందారు.అయితే ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయడం, అది కేంద్ర పరిధిలో ప్రస్తుతానికి పెండింగ్ లో ఉండటంతో మరికొద్ది రోజుల్లోనే శాసన మండలి రద్దు అవుతుందని జగన్ భావిస్తున్నారు.

అందుకే ఎమ్మెల్సీ పదవుల ద్వారా మంత్రి పదవులు పొందిన ఏపి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలకు ముందుగానే జగన్ రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు.దీంతో త్వరలోనే వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Ys Jagan Contemplating Cabinet Expansion-ఓహో మంత్రి పదవ

ఈ రెండు స్థానాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు.వీరిలో ఎక్కువగా జగన్ కు అత్యంత వీర విధేయులైన వారు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు ఉన్నారు.

అలాగే వైసిపి స్థాపించిన దగ్గర నుంచి జగన్ కు ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.సీనియర్ ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే, కొత్తగా మరో ఇద్దరు మంత్రి పదవి రేసులోకి దూసుకొచ్చారు.

వారే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పొన్నాడ సతీష్ కుమార్ , గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజనీ కుమారి.పొన్నాడ సతీష్ కు అవకాశం దక్కినా విడుదల రజిని కి మాత్రం అవకాశం దక్కడం అనుమానంగానే ఉంది.

ఎందుకంటే విడుదల రజిని ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి నిత్యం వివాదాల్లోనే ఉంటూ వస్తున్నారు.అలాగే స్థానిక ఎంపీ లావు కృష్ణదేవరాయలతోనూ విభేదాలు ఉన్నాయి.

అదీ కాకుండా ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆమెకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.

Ys Jagan Contemplating Cabinet Expansion
Advertisement

ఇక పార్టీలో సీనియర్ నాయకుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా కొలుసు పార్థసారథి ఉన్నప్పటికీ, అదే సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ మంత్రివర్గంలో ఉండడంతో పార్థసారథికి అవకాశం దక్కే ఛాన్స్ లేనట్లుగా తెలుస్తోంది.బీసీలు చాలామంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉండడంతో ఈసారి బీసీలను తప్పించి వేరే వారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.అయితే ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు మాత్రం ఆపకుండా చేస్తున్నారు.

జగన్ నిర్ణయం ఏ క్షణంలోనైనా మారుతుందని, అప్పుడు తమకు తప్పకుండా అవకాశం దొరుకుతుందేమోనని ఆశతో చాలామంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా వార్తలు