సాధారణంగా ఏ సినిమాకు అయినా రిలీజ్ తర్వాత నెగిటివ్ లేదా పాజిటివ్ రివ్యూలు వస్తాయి.
అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star ) ఒక్క షో కూడా ప్రదర్శితం కాకుండానే యూట్యూబ్ లో ఈ సినిమా గురించి ఎన్నో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.
ఎలాంటి పాపులారిటీ లేని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఈ సినిమా విషయంలో ద్వేషాన్ని ప్రదర్శించాయి.ఫ్యామిలీ స్టార్ సినిమాను ఇంతలా టార్గెట్ చేయడంపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రిలీజ్ కు ముందే నెగిటివ్ రివ్యూలు దారుణమంటూ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.దిల్ రాజు( Dil Raju ) అలాంటి యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని విజయ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇప్పటికే పైరసీ వల్ల సినిమా నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతోందనే సంగతి తెలిసిందే.మరోవైపు ఫ్యామిలీస్టార్ మూవీకి మిక్స్డ్ రివ్యూలు( Mixed Reviews ) వచ్చాయి.కొన్ని రివ్యూలు పాజిటివ్ గా ఉంటే మరికొన్ని రివ్యూలు మాత్రం నెగిటివ్ గా ఉన్నాయి.
సెకండాఫ్ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమాకు ప్లస్ అయ్యేదని చెప్పవచ్చు.పరశురామ్( Parasuram ) సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా కొన్ని తప్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తప్పులను ఈ సినిమా విషయంలో రిపీట్ చేయకుండా ఉండాల్సిందని నెటిజన్లు చెబుతున్నారు.
దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ స్టార్ విషయంలో గీతా గోవిందం( Geetha Govindam ) స్టైల్ ను ఫాలో అయ్యారని నెటిజన్లు చెబుతున్నారు.మ్యూజిక్ మరీ అద్భుతంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు( Vijay Deverakonda Movies ) హిట్ అవుతున్నా ఒక లిమిట్ దాటి కలెక్షన్లు సాధించడం లేదు.
ఫ్యామిలీ స్టార్ కూడా మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధించడం కష్టమని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy