యూట్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక గేమర్స్‌కు పండగే..

ప్రముఖ సోషల్ మీడియా వీడియో ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్( Youtube ) అంటే తెలియనివారు ఎవరూ ఉండరు.స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి ఫోన్లలో ఇది తప్పనిసరిగా ఉంటుంది.

రోజూ ఒక్కసారైనా సరే యూట్యూబ్‌ను ఓపెన్ చేసి ఏదోక వీడియో చూస్తూ ఉంటారు.కొంతమంది అయితే గంటల కొద్ది యూట్యూబ్‌లో గడుపుతూ ఏదోక వీడియోలు చూస్తూ సరదాగా గడుపుతూ ఉంటారు.

అలాగే కొంతమంది దీనిని ఆదాయ వనరుగా కూడా ఉపయోగించుకుంటున్నారు.యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.

Youtube Is Testing Product For Playing Online Games Details, Good News, Games,

అయితే యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వస్తూ ఉంటాయి.కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్ అప్డేట్ చేస్తూ ఉంటుంది.అందులో భాగంగా తాజాగా యూట్యూబ్‌లో మరో నయా ఫీచర్ వచ్చేస్తోంది.

Advertisement
YouTube Is Testing Product For Playing Online Games Details, Good News, Game's,

గేమర్స్‌కు( Gamers ) ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది.త్వరలోనే నేరుగా యూట్యూబ్‌లో ఆన్‌లైన్ గేమ్స్( Online Games ) ఆడుకునేలా కొత్త ఫీచర్ రానుంది.

ఇందుకోసం అంతర్గతంగా టెస్టింగ్ కూడా జరుగుతోంది.వెబ్‌బ్రౌజర్, ఆండ్రాయిడ్ మొబైల్స్, యాపిల్ ఐఫోన్ యూజర్లందరికీ ఈ గేమింగ్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

దీని వల్ల యూట్యూబ్‌లో వీడియోలు చూడటమే కాకుండా ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట.

Youtube Is Testing Product For Playing Online Games Details, Good News, Games,

ఇప్పటికే తన ఉద్యోగులతో యూట్యూబ్‌లో గేమింగ్ ఫీచర్‌ను గూగుల్ టెస్ట్ చేయిస్తోంది.ఆర్కే‌డ్ గేమ్ స్టాక్ బౌన్స్ లాంటి గేమ్‌ను అందుబాటులో ఉంది టెస్టింగ్ చేయిస్తోంది.ఈ ఫీచర్ వస్తే ఆన్‌లైన్స్ గేమర్స్ యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

దీని వల్ల యూట్యూబ్‌కు కూడా మంచి యాడ్ రెవెన్యూ వస్తుంది.అలాగే యూట్యూబ్ నుంచి సరికొత్త షాపింగ్ ఛానెల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.2023 జూన్ 30న దక్షిణ కొరియాలో అధికారికంగా ఈ ఛానెల్ ను ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు