భీమవరం కోర్టులో యువకుడి ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

తనకు న్యాయం జరగలేదంటూ చిరంజీవి అనే యువకుడు కోర్టులో న్యాయదేవత విగ్రహాం ముందు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు.

అయితే బాధితుడు అక్టోబర్ 31న చెక్కు బౌన్స్ కేసులో శిక్షపడి రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం.చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.2 లక్షల నష్టపరిహారం విధించింది.కాగా సదరు యువకుడు కృష్ణా జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామ వాసిగా గుర్తించారు.

The Foods That Help To Kill Breast Cancer Details

తాజా వార్తలు