సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన తొలిహీరోగా జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ గర్వించేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి, తారక్ ప్రతిభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సినిమా కోసం ప్రాణం పెట్టేంత స్థాయిలో కష్టపడే అతికొద్ది హీరోలలో తారక్ ఒకరు.

ఈ మధ్య కాలంలో తారక్ సినిమాలు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నా సోలో హీరోగా తారక్ టాలెంట్ కు తగిన మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.ఇప్పటికే ఆస్కార్( Oscar ) యాక్టర్స్ బ్రాంచ్ లిస్ట్ లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరో అరుదైన ఘనతను సాధించి అభిమానులు గర్వపడేలా చేశారు.

ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ( Variety Magazine ) తాజాగా గ్లోబల్ మీడియాలో 500 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేయగా ఈ జాబితాలో తారక్ పేరు కూడా ఉండటం గమనార్హం.సౌత్ ఇండియా నుంచి ఈ జాబితాలో చేరిన తొలి హీరో ఎన్టీఆర్ కావడం అభిమానుల సంతోషానికి మరింత కారణమైంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ( Devara Movie ) గ్లింప్స్ రిలీజ్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.జనవరి నెల 1వ తేదీన దేవర గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వెరైటీ మ్యాగజైన్ లో చోటు దక్కడం గురించి తారక్ రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.

Advertisement

ఈ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు.

దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా కొరటాల శివ( Koratala Siva ) యూనివర్స్ అనేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.దేవర మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ లాభాల్లో వాటా తీసుకుంటూ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు