ఆర్జీవీ డైరెక్షన్ లో చేస్తున్న యంగ్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి మనందరికీ తెలిసిందే.

ఆయన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ ఒక్క సినిమాతోనే ఆయన దాదాపు రెండు దశాబ్దలాపాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అంటే ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు.

దీనికి తోడు వరుస సినిమాలు చేస్తూ ఆయన బిజీ గా ఉన్నారు బాలీవుడ్( Bollywood ) లో అమితాబచ్చన్( Amita Bachchan ) లాంటి హీరోతో కూడా సర్కార్ లాంటి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు ఏం చేయకుండా తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ తనకు నచ్చినట్టుగా ఉంటూ బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఈయన ప్రస్తుతం హీరో అయిన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) తో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.నిజానికి వర్మ ఒక మంచి దర్శకుడు అయినప్పటికీ ఆయన చేసే సినిమాలు అన్ని కూడా తనకు నచ్చినట్టుగా చేస్తూ జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన సక్సెస్ కొట్టిన సినిమాలైతే ఈ మధ్యకాలంలో ఏమి లేవు.ఆయనకి చివరగా సక్సెస్ వచ్చిన సినిమా ఏంటంటే కిల్లింగ్ వీరప్పన్ సినిమా( Veerappan movie ) ఈ సినిమాతో అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాడు కానీ ఆ తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

Advertisement

ఇక ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరో ను పెట్టుకొని ఎలాంటి సినిమా తీస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కిరణ్ అబ్బవరం కూడా సినిమాకి ఒప్పుకున్నాడా లేదా అనే విషయం తెలియాలంటే వాళ్ల నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!
Advertisement