అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.ఇది మాయం కాదు, మంత్రం అసలే కాదు.
ఇది 3 భాషల ముచ్చటైన పెన్ను.ఇది చేతిలో ఉంటే, 3 భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే అని చెబుతున్నారు.
అయితే దీనితో మీరు రాయడం కష్టం గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయని చెబుతోంది చైనీస్ కంపెనీ స్మార్ట్ యుడావో.( Smart Youdao ) అవును, దీనిని ఇటీవలే మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది.
చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను( Pen ) ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే తర్జుమా చేసేస్తోంది మరి.ఇది అందరికీ ఉపయోగపడదు కానీ, కొంతమందికి భాషావేత్తలకు, భాషా ఔత్సాహికులకు బాగా ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ పెన్ను ప్రత్యేకత ఏమంటే, సాధారణ పుస్తకం లేదా ఈ-బుక్‌లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి వెంటనే తర్జుమా అయిపోతుందన్నమాట.అంతేకాదండోయ్.తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయ పదాలను కూడా ఇట్టే చెప్పేస్తోంది.
విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర తెలిస్తే షాక్ అవ్వడం మీ వంతు అవుతుంది.అవును.దీని ధర 199.99 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.16,474 మాత్రమే!
కావలసిన వారు ఇప్పుడే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.ఇంకా దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయని సదరు కంపెనీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.మనుషులు అసలు రాయడమే అవసరం లేకుండా ఇది పనిచేయనుంది.
విద్యార్థులు తమకు నచ్చిన నోట్స్ ని ఇది తమకు కావలసిన భాషలోకి వెంటనే అనువదిస్తుంది.అదేవిధంగా కళారంగాలలో వున్నవారికి ఇది మరెంతో ఉపయోగ పడనుంది.
ఒక భాషలోని పుస్తకాలను వేరొక భాషలోకి తర్జుమా చేసేయగలదు.అయితే ఈ విషయంలో ఎంత నిక్కచ్చిగా చేస్తోందో ఇంకా అధికారికంగా వెలువడాల్సి వుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy