ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

వాస్తు శాస్త్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి అలాగే ఇంట్లో సానుకూల వాతావరణం( Positive Energy ) నెలకొనడానికి ఎన్నో రకాల విషయాలను వివరించడం జరిగింది.

అయితే అందులో కొందరు కొన్నింటిని తూచా తప్పకుండా పాటిస్తే మరి కొందరు మూఢనమ్మకాలు అని కొట్టి పాడేస్తూ ఉంటారు.

అందులో భాగంగానే శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో ఖాళీగా అస్సలు ఉంచకూడదు.వాటిని ఖాళీగా ఉంచడం వలన ఆర్థిక పరిస్థితి పై ప్రతికూల ప్రభావం పడుతుందట.

అంతేకాకుండా ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టడంతో పాటు దురదృష్టం కూడా పట్టిపీడిస్తుంది.వాస్తు శాస్త్రం( Vastu Sashtram ) ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులను ఖాళీగా ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పర్సును( Wallet ) ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు.వీటిలో ఎప్పుడూ కొంత డబ్బు అయినా ఉంచుకోవాలి.శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు ఉంటే బీరువా లేదా పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి( Lakshmi Devi ) మీపై ఆగ్రహిస్తుందట.

Advertisement

ఆ సందర్భాలలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గోమతి చక్రం, పసుపుతో పాటు కొంత డబ్బులు ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచాలి.ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే ఎప్పుడు కూడా బాత్రూంలో బకెట్( Bucket ) ఖాళీగా ఉండకూడదు.మరి ముఖ్యంగా రాత్రి సమయంలో బకెట్ ని ఖాళీగా ఉంచడం అస్సలు మంచిది కాదు బకెట్లో నీరు లేనప్పుడు ప్రతికూల శక్తి త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా బాత్రూంలో విరిగిన లేదా నల్లటి బకెట్లను అస్సలు ఉపయోగించకూడదు.

అలాంటివి ఉపయోగించడం వలన ఆర్థిక సమస్యలు వాస్తు దోషాలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పూజ గదిలో ఎప్పుడు కూడా ఖాళీ కలశాన్ని( Kalash ) ఉంచకూడదు కలశం లో కొంచెం నీరు పోసి ఉంచాలి. పూజ గదిలో ఖాళీ కలశం ఉంచడం వలన ఆ శుభం కలుగుతుంది కలశపాత్రలో ఎల్లప్పుడూ కొంత నీరు గంగాజలం తులసి ఆకులు ఉండాలి.వీటిని పూజ గదిలో ఉంచితే ఆ భగవంతుని అనుగ్రహం మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో మీ ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుంది ఇక వంట గదిలో బియ్యం డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే ఇంట్లోకి దురదృష్టం వస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024
Advertisement

తాజా వార్తలు