ఈ ఆలయంలోకి వెళ్లాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశము ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలకు నిలవు.అయితే ఒక్కో ఆలయం ఒక్కో చరిత్రను, ఒక్కో ఆచారాన్ని, ఒక్కో సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది.

మరి కొన్ని ఆలయాలలో అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖాండ్‌లోని( Uttarakhand ) చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో లాతూ మందిరంలో( Latu Temple ) వింత ఆచారాలను పాటిస్తున్నారు.అంతేకాకుండా అంతుచిక్కని రహస్యాలు కూడా ఇందులో ఎన్నో దాగి ఉన్నాయి.

ఆ ఆలయంలో ప్రవేశించే ముందు భక్తులు కళ్లకు గంతలు కట్టుకుంటే, పూజారి కూడా నోటికి, కళ్ళకు గంతులు కట్టుకోవాలంట.

You Should Be Blindfolded While Entering Latu Temple Of Uttarakhand Details , B
Advertisement
You Should Be Blindfolded While Entering Latu Temple Of Uttarakhand Details , B

ఆ విధంగా ప్రవేశించి ఆ దేవతని దర్శనం చేసుకోవాలట.ఉత్తరాఖండ్ లోని నందా దేవి మతపరమైన సోదరీగా లాతు దేవత గా( Latu Devta ) పరిగణిస్తారు అని అక్కడ స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రాంత ప్రజలు ఈ దేవతను చాలా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఈ గుడిలోకి ప్రవేశించడానికి భక్తులు కళ్లకు గంతులు( Blindfolded ) కట్టుకుంటే ఇక అక్కడ పూజలు చేసే పూజారి కూడా నోటికి అలాగే కళ్లకు గంతలు కట్టుకోవాలంట.అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

You Should Be Blindfolded While Entering Latu Temple Of Uttarakhand Details , B

నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి లాతు దేవాలయంలో దర్శనమిస్తాడట.ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారు అవుతారని అక్కడి పండితులు చెబుతున్నారు.కాబట్టి అక్కడి భక్తులు అనాది కాలంగా పాటిస్తూ వస్తున్నారని కూడా వాళ్ళు వివరించారు.

అయితే ఈ దేవాలయం రోజూ తెరవకుండా కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారట.ఆలయం తెరచిన రోజు భక్తులు ప్రవేశం చేసి దూరం నుండే దైవ దర్శనం చేసుకుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఈ విధంగా అక్కడి భక్తులు మణిని( Pearl ) చూడడం వలన తమ కళ్ళకు ఎలాంటి హాని కలగకూడదని పండితులు కూడా అలాగే భక్తులు కూడా కళ్ళకు గంతులు కట్టుకొని ఆ గుడిలోకి ప్రవేశిస్తారట.

Advertisement

తాజా వార్తలు