ముసలివాళ్ళకి ఇది తినిపిస్తే ఎముకలు బలంగా ఉంటాయి

మన ఇంట్లో ఎలాగో ఓ వయసుకి వచ్చిన ముసలివాళ్ళు ఉంటారు.వారికి ఎలాగో రకరకాల శారీరక సమస్యలు ఉంటాయి.

ఒళ్ళు నొప్పులు, రక్తహీనత, బాలహీనత, కీళ్ళ నొప్పులు .ఇలా రకరాకాల సమస్యలు ఉంటాయి.అందులో కీళ్ళ సమస్యలు చాలా సాధారణం విషయం.

మిగితా సమస్యలు ఉన్నా లేకున్నా కీళ్ళ నొప్పుల సమస్య ఉంటుంది.అందుకే కారణం వయసు పెరిగినాకొద్ది ఎముకలు బలహీనంగా మారడమే.

ఇలాంటి సమయంలో బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఎముకలు సునాయాసంగా, చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్ అయిపోయి చాలా నొప్పిని కలిగిస్తాయి.

Advertisement

మరి ఈ సమస్యకు ఇంట్లో చికిత్స లేదా అంటే ఉంది.అది కూడా మనకు పూర్తిగా అందుబాటులో ఉండే చికిత్స.

ఏమి లేదు .మీ తాతయ్య, అమ్మమ్మ, బామ్మలకి పెరుగు ఎక్కువ తినిపించండి.పెరుగులో కాల్షియం పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఎలాంటి సహాయం చేస్తుందో మనకు తెలిసిందే.ఒక పరిశోధన ప్రకారం పెరుగు ఎక్కువ తింటే ఎముకలలో సమస్యలు వచ్చే అవకాశం ఆడవారిలో 31% తగ్గుతుందట.

అదే మగవారిలో అయితే ఎముకలలో సమస్యల అవకాశాలు ఏకంగా 52% తగ్గుతుందట.ఈ పరిశోధనలో 1057 మంది ఆడవారు, 763 మగవారు పాల్గొన్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

వీరంతా బోన్ మినరల్ డెన్సిటి చేయించుకున్న వారే.అందరికి పెరుగు డైట్ లో ఇవ్వడం వలన అందరిలో మంచి ఫలితాలు కనిపించాయట.

Advertisement

"పెరుగులో ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రింట్స్ చాలా ఉంటాయి.మా పరిశోధనలో బయటపడిన ఫలితాలను చూస్తేనే అర్థం అవుతోంది ఎముకల ఆరోగ్యాన్ని పెంచడానికి పెరుగు ఎంతలా పనికి వస్తుందో.

ఏది పడితే అది తినే బదులు పెరుగు శాతాన్ని డైట్ లో పెంచాలని మా రిసర్చ్ చెబుతోంది.కాల్షియం ఎలాగో ఎముకలకి మంచిది.

దాంతో పాటు మైక్రో బయోట, మిక్రో న్యూట్రింట్ కంపోజిషన్ వలన పెరుగు ఎముకల కోసం మంచి ఆహారం అని చెప్పవచ్చు" అంటూ డబ్లిన్ కి చెందిన డాటర్ సెయింట్ జేమ్స్ చెప్పారు.కాబట్టి ఎముకలు అరిగిపోయి, బలహీనంగా మారి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీ ఇంట్లో వృద్ధులకి పెరుగు ఎక్కువ తినిపించండి.

ప్రోబయోటిక్స్ శరీరానికి ఎంత మంచిదో అర్థం అయ్యేలా చెప్పండి.అన్నంలో పెరుగు తినిపించడంతో పాటు పెరుగుతో బట్టర్ మిల్క్ చేసి తాగించాలి.

తాజా వార్తలు